Lok Sabha Elections: ముగిసిన అయిదో దశ ఎన్నికల పోలింగ్ !
ముగిసిన అయిదో దశ ఎన్నికల పోలింగ్ !
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల అయిదో దశ పోలింగ్ ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో మొత్తం 695 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం… సాయంత్రం ఏడు గంటలకు దాదాపు 57.38 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో 73 శాతం, అత్యల్పంగా మహారాష్ట్రలో 48.88 శాతం ఓటింగ్ నమోదైంది.
Lok Sabha Elections Update
ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒడిశా తదితర రాష్ట్రాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో మొత్తంగా 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అయిదో దశతో కలిపితే 428 సీట్లకు పోలింగ్ పూర్తయ్యింది. ఈసీ వివరాల ప్రకారం ఇప్పటివరకు నాలుగు దశల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 66.95 శాతం పోలింగ్ నమోదైంది.
Also Read : MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్ పై కీలక అప్డేట్