Lok Sabha Speaker : లోక్ సభ ఘటన బాధాకరం
స్పష్టం చేసిన లోక్ సభ స్పీకర్
Lok Sabha Speaker : న్యూఢిల్లీ – దాదాపు 22 ఏళ్ల తర్వాత పార్లమెంట్ లో అనుకోని ఘటన చోటు చేసుకుంది. బుధవారం గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు లోక్ సభలోకి చొచ్చుకు వచ్చారు. సామాన్యుల గ్యాలరీలోకి ముందుగా వచ్చారు. ఆ తర్వాత జీరో అవర్ కింద లోక్ సభ ప్రారంభమైంది.
Lok Sabha Speaker Comment
ఇది ఇలా ఉండగానే ఇద్దరు గ్యాలరీ నుంచి సభలోకి దుంకారు. దీంతో సభలో ఉన్న ఎంపీలు భయాందోళనకు గురయ్యారు. ఆ వెంటనే కొందరు ఎంపీలు పరుగులు తీశారు. మరికొందరు ఎంపీలు ఆ ఇద్దరిని పట్టుకునే ప్రయత్నం చేశారు.
ఈ ఘటనతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపింది. దేశ రాజధానిలోని పార్లమెంట్ కే రక్షణ లేక పోతే ఇక ప్రజలకు ఎలా సెక్యూరిటీ కల్పిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా లోక్ సభలో చోటు చేసుకున్న ఘటనపై స్పీకర్ ఓం బిర్లా(Lok Sabha Speaker) స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. సభలోకి ప్రవేశించిన ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. దీని వెనుక ఎవరు ఉన్నారనేది త్వరలోనే తేలుతుందన్నారు స్పీకర్.
Also Read : CM Revanth Reddy : అసెంబ్లీ పార్లమెంట్ లాగా ఉండాలి