Lord Malayappa Swamy : కెన‌డాలో ఘ‌నంగా శ్రీ‌వారి క‌ళ్యాణం

ఘ‌నంగా మ‌ల‌య‌ప్ప స్వామి వైభోగం

Lord Malayappa Swamy : టీటీడీ ఆధ్వ‌ర్యంలో కెనడా, యుఎస్ ల‌లోని 14 న‌గ‌రాల‌లో శ్రీ శ్రీ‌నివాస క‌ళ్యాణోత్స‌వాలు కొన‌సాగుతున్నాయి. జూన్ 4న టొరొంటోలో, 10న మోనిటేరియ‌ల్ , 11న ఒట్టావాలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామి(Lord Malayappa Swamy) వారి క‌ళ్యాణం అత్యంత వైభ‌వోపేతంగా జ‌రిగింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నుండి అర్చ‌కులు, వేద పండితులు క‌ళ్యాణాన్ని నిర్వ‌హించారు.

ఏపీ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ మొద‌టి నుండి టీటీడీతో ఒక వైపు ఆయా న‌గ‌రాల కార్య‌నిర్వాహ‌క వ‌ర్గాల‌తో మ‌రో వైపు స‌మ‌న్వ‌యం చేసుకుంటూ క‌ళ్యాణోత్స‌వం నిర్వ‌హిస్తూ వ‌చ్ఆచ‌రు. భ‌క్తులు, అర్చ‌కులు, వేద పండితుల‌కు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

ఇక టొరంటో , ఒట్టావా న‌గ‌రాల‌లో వేదిక‌ను అద్బుతంగా అలంక‌రించారు. క‌న్నుల‌కు ఇంపుగా, ఆధ్యాత్మిక వెల్లి వెరిసేలా చేశారు. ఈ క‌ళ్యాణోత్స‌వాల‌కు తెలుగు వారే కాకుండా ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన 10 వేల మందికి పైగా భ‌క్తులు మ‌లయ‌ప్ప స్వామిని ద‌ర్శించుకున్నారు. క‌ళ్యాణ ఘ‌ట్టాన్ని భ‌క్తి పార‌వ‌శ్యంతో తిల‌కించారు. అనంత‌రం భ‌క్తులంద‌రికీ తిరుమ‌ల నుండి తీసుకు వ‌చ్చిన మ‌హా ప్ర‌సాదం ల‌డ్డూల‌ను అందించారు నిర్వాహ‌కులు.

ఈ క‌ళ్యాణోత్స‌వాల‌లో ప్ర‌వాసాంధ్రుల వ్య‌వ‌హారాల ప్ర‌భుత్వ స‌ల‌హాదారు , ఏపీఎన్ఆర్టీఎస్ చీఫ్ వెంక‌ట్ ఎస్ మేడ‌పాటి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో క‌ళ్యాణోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

Also Read : Bhatti Vikramarka : కేసీఆర్ పాల‌న‌లో రైతులు బుగ్గిపాలు

 

Leave A Reply

Your Email Id will not be published!