Hardik Pandya : వర్ధమాన ఆటగాళ్లకు బోలెడన్ని అవకాశాలు
స్పష్టం చేసిన తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా
Hardik Pandya : న్యూజిలాండ్ తో వన్డే, టి20 సీరీస్ లో భాగంగా భారత జట్టు నవంబర్ 18 నుంచి అధికారికంగా సీరీస్ ఆడనుంది. వన్డే జట్టుకు వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తుండగా టి20 జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) వ్యవహరిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ లో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పరాజయం మూటగట్టుకుంది.
ఈ తరుణంలో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు రవిచంద్రన్ అశ్విన్ ను విశ్రాంతి పేరుతో పక్కన పెట్టింది. ఇదే సమయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కూడా రెస్ట్ ఇచ్చింది. అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ను తాత్కాలిక కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ ను నియమించింది. ఇక న్యూజిలాండ్ టూర్ లో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ ల సీరీస్ ఆడనుంది. ఈ సందర్భంగా ట్రోఫీని ఆవిష్కరించారు.
అనంతరం టి20 తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మీడియాతో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశాడు. 2024లో వెస్టిండీస్, అమెరికాలో జరిగే ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు సంబంధించి వర్దమాన (యువ) ఆటగాళ్లకు మంచి భవిష్యత్తు ఉందని స్పష్టం చేశాడు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు పాండ్యా. ప్రస్తుతం క్రికెట్ ను ఆస్వాదిస్తున్నామని అన్నాడు. ఆట అన్నాక గెలుపు ఓటములు సహజమేనని పేర్కొన్నాడు.
Also Read : గుజరాత్ టైటాన్స్ ఆరుగురు రిలీజ్