LPG Price : వంట గ్యాస్ ధర తగ్గింపు
రూ. 200 తగ్గించిన కేంద్రం
LPG Price : దేశంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఇప్పటికే గ్యాస్ , ఆయిల్ బాదుడుతో నానా ఇబ్బందులు పడుతున్న వారికి తీపికబురు చెప్పింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఖుష్ కబర్ తెలిపింది.
LPG Price Will Reduce
గృహానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ పై రూ. 200 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఉజ్వల పథకం కింద లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ పై అదనపు సబ్సిడీ అందించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార , క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) స్పష్టం చేశారు.
మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయాల గురించి వెల్లడించారు. పీఎంయుఐ లబ్దిదారులకు అదనంగా రూ. 200 సబ్సిడీతో పాటు ప్రతి సిలిండర్ పై మొత్తంగా రూ. 400 సబ్సిడీ ఇవ్వనున్నట్లు చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైందని తెలిపారు అనురాగ్ ఠాకూర్. ఇదిలా ఉండగా తగ్గించిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రక్షా బంధన్ ను పురస్కరించుకుని ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉజ్వల పథకం కింద 75 లక్షల కొత్త వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Also Read : Thatikonda Rajaiah : టికెట్ రాకున్నా బీఫామ్ నాకే