LTTE Chief Prabhakaran Alive : తమిళ పులి బతికే ఉంది
సంచలన ప్రకటన చేసిన జాతీయ నేత
LTTE Chief Prabhakaran Alive : ప్రపంచం విస్తు పోయేలా సంచలన ప్రకటన చేశారు తమిళ జాతీయ వాద ఉద్యమ నాయకుడు పజా నెడుమారన్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మీరంతా అనుకున్నట్టు ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడని ప్రకటించారు.
తమిళులకు ఆరాధ్య దైవం ప్రభాకరన్. ఆయనను తమిళ టైగర్ గా పిలుచుకుంటారు. 2009లో శ్రీలంక సైన్యం అతడిని మట్టుబెట్టింది. ఈ విషయాన్ని ప్రకటించింది ఆనాటి సర్కార్. ప్రభాకరన్ చని పోయినట్లు ఫోటోలు కూడా విడుదల చేసింది ఆనాటి శ్రీలంక ప్రభుత్వం.
యావత్ లోకమంతా ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ చని పోయాడని అందరూ అనుకుంటున్న తరుణంలో పజా నెడు మారన్ సంచలన ప్రకటన చేయడం కలకలం రేపింది. అంతే కాదు ప్రభాకరన్ సజీవంగా బతికే ఉన్నాడని(LTTE Chief Prabhakaran Alive) , ఆయన తన కుటుంబంతో టచ్ లో ఉన్నాడని మాజీ కాంగ్రెస్ నాయకుడు చెప్పాడు.
తమిళ జాతి విముక్తి కోసం త్వరలో ప్రజా జీవితంలో చేరుతారని తమిళ జాతీయ వాద ఉద్యమ నేత స్పష్టం చేశారు. మహింద రాజపక్సకు వ్యతిరేకంగా సింహళీయుల నిరసన , అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎల్టీటీఈ చీఫ్ బహిరంగంగా రావడానికి సరైన సమయం ఆసన్నమైందని అన్నారు.
మరో వైపు ప్రభాకరన్ మాజీ మిత్రులు ప్రభుత్వ కిరాయి సైనికులుగా మారారు. అతడిని చంపారు. ఆయన మరణంతో 26 ఏళ్ల శ్రీలంక అంతర్యుద్దం ముగిసింది. నెడుమారన్ ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయాలలో కలకలం రేపింది. ఎల్టీటీఈ చీఫ్ గా ఉన్న బాలసింహం నడేసన్ , టైగర్స్ శాంతి సెక్రటేరియట్ చీఫ్ సీవరత్నం పులిదేవన్ శ్రీలంక సైన్యానికి లొంగి పోయారు.
Also Read : గిరిజన కుటుంబానికి రాహుల్ భరోసా
Bhim Army Chief : పవర్ లోకి వస్తే గిరిజనుడే సీఎం – ఆజాద్