Temzen Imna : ఉద్దేశం మంచిదైతే ల‌క్ మీ బానిస – టెమ్ జెన్

వాళ్లు అసాధ్య‌మైన వాటిని సుసాధ్యం చేశారు

Temzen Imna : నాగాలాండ్ గిరిజ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్(Temzen Imna)  గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీలో ముగ్గురికి విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. వారిలో ఒక‌రు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కాగా మ‌రొక‌రు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు, నాగాలాండ్ మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్.

ఆయ‌న సోష‌ల్ మీడియాలో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్. ఏది ట్వీట్ చేసినా అది క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంది. హ‌ల్ చ‌ల్ గా మారుతుంది. చిన్న క‌ళ్లు, చెర‌గ‌ని చిరున‌వ్వు, మాట్లాడే ప‌ద్ద‌తి, ప్ర‌జ‌ల‌కు వివ‌రించే విధానం ఇప్పుడు ఆయ‌న‌ను టాప్ మోస్ట్ లీడ‌ర్ గా చేసేసింది. గురువారం టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ నాగాలాండ్ రైతుల గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

నెటిజ‌న్లు టెమ్ జెన్ రాసిన పోస్టుకు చేసిన కామెంట్స్ కు ఫిదా అవుతున్నారు. నాగాలాండ్ రైతులు అసాధ్య‌మైన అస‌మాన‌త‌లు ఎలా అధిగ‌మించారో పంచుకున్నారు. మీరంతా మా అన్న‌దాత‌ల‌ను చూసి నేర్చుకోవాల‌ని కోరాడు టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్(Temzen Imna) .

కొండ ప్రాంతంలోని పొలాల్లో ప‌ని చేస్తున్న నాగాలాండ్ రైతుల క‌ష్టాన్ని , వారు చేస్తున్న ప‌నుల‌తో కూడిన వీడియోల‌ను పంచుకున్నారు గిరిజ‌న శాఖ మంత్రి. ఆయ‌న వారి గురించి, వారి క‌ష్టం గురించి హిందీలో ట్వీట్ చేశారు.

మీ ఉద్ధేశం మంచిదైతే అదృష్టం మీ బానిస‌. మీకు మంచి క‌ర్మ ఉంటే మీ ఇంట‌లో మ‌ధుర‌, కాశీ కూడా ఉంటాయ‌ని పేర్కొన్నారు.

Also Read : మెయిన్ పురి బ‌రిలో డింపుల్ యాద‌వ్

Leave A Reply

Your Email Id will not be published!