PM Modi : దేశాన్ని తల ఎత్తుకునేలా చేశా – మోదీ
సమున్నత భారతావనికి గుర్తింపు తెచ్చా
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎనిమిదేళ్ల పాలనలో సిగ్గుతో తల దించుకునేందుకు ఏ ఒక్కరు ఒక్క కారణం కూడా వేలు పెట్టి చూపలేరన్నారు.
దేశానికి చేసిన సేవలో తాను ఏ ఒక్క ప్రయత్నాన్ని విడిచి పెట్టిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. మిమ్మల్ని లేదా భారత దేశంలోని ఒక్క వ్యక్తి కూడా తల వంచే చేసే ఏ పనిని తాను ఆమోదించ లేదని చెప్పారు.
గుజరాత్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజ్ కోట్ జిల్లా లోని అతికోట్ పట్టణంలో 200 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా విపక్షాలపై ప్రధానంగా సుదీర్ఘ కాలం పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు మోదీ. 2014లో తమపై నమ్మకం ఉంచి దేశ ప్రజలు భారతీయ జనతా పార్టకి పట్టం కట్టారు.
ఆనాటి నుంచి నేటి దాకా దేశ సేవలోనే ప్రధానమంత్రిగా తాను నిమగ్నమై ఉన్నానని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడేలా దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లానని అన్నారు.
అత్యంత శక్తివంతమైన దేశాలలో భారత్ కూడా ఒకటి అన్న విషయాన్ని గుర్తు పెట్టు కోవాలన్నారు. డిజిటల్ టెక్నాలజీలో భారత్ టాప్ లో ఉందన్నారు. ఈ ఘనత తమదేనని పేర్కొన్నారు ప్రధాన మంత్రి.
గత ఎనిమిదేళ్ల పరిపాలనా కాలంలో మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలు గన్న భారత దేశాన్ని నిర్మించేందుకు నిజాయితీగా ప్రయత్నం చేశానని చెప్పారు నరేంద్ర మోదీ(PM Modi).
Also Read : సహకార రంగం మరింత బలోపేతం