Madhu Yashki Goud : క్యారెక్టర్ లేని వాళ్లే దుష్ప్రచారం
మధు యాష్కి గౌడ్ షాకింగ్ కామెంట్స్
Madhu Yashki Goud : కాంగ్రెస్ పార్టీలో కల్లోలం కొనసాగుతోంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు తాజాగా ప్రకటించిన కమిటీల ఏర్పాటుపై భగ్గుమన్నారు. సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్లు దామోదర రాజ నర్శింహ్మ, మధుయాష్కి గౌడ్ , జగ్గా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మధు యాష్కి గౌడ్(Madhu Yashki Goud) ప్రసంగించారు. క్యారెక్టర్ లేని వాళ్లే తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు వలస వచ్చిన వారికి మధ్య యుద్దం జరుగుతోందన్నారు.
ప్రస్తుతం సీనియర్ నాయకులు సేవ్ కాంగ్రెస్ అంటూ ముందుకు వెళతామన్నారు. తమ బాధంతా తమకు పదవులు దక్కలేదని కాదని, కానీ తమను నమ్ముకుని ముందు నుంచి పార్టీ కోసం పని చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందనే ఆందోళనని అన్నారు.
అందుకే పార్టీని కాపాడుకునే దిశగా తాము ఇక నుంచి ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ విషయాన్ని హై కమాండ్ దృష్టికి తీసుకు వెళతామన్నారు. తమ గురించి ఇంకొకరు చెబితే వినే స్థితిలో తాము లేమన్నారు. తాను ఇతర దేశం నుంచి పార్టీ కోసం వచ్చి ఇక్కడ పని చేస్తున్నానంటూ తెలిపారు మధు యాష్కి గౌడ్.
కావాలని క్యారెక్టర్ లేని వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని తాము పట్టించుకునే ప్రసక్తి లేదన్నారు. విచిత్రం ఏమిటంటే తమను కోవర్టులంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని తప్పు పట్టారు.
నాలుగు పార్టీల్లో తిరిగి వచ్చిన చరిత్ర తమది కాదన్నారు.
Also Read : శివాజీకి అవమానం వెల్లువెత్తిన ఆగ్రహం