Madhu Yashki : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్(Madhu Yashki ). వరి దీక్ష పేరుతో చేస్తున్న ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు, నిరసనలు అన్నీ బక్వాస్ అని కొట్టి పారేశారు.
ఇదంతా డ్రామా తప్ప మరొకటి కాదన్నారు. సోమవారం గాంధీ భవన్ లో మధు యాష్కి మాట్లాడారు. పన్ను నొప్పితో ఢిల్లీకి పోయిండు. అక్కడ సకల సౌకర్యాలు అనుభవిస్తూ మళ్లీ కొత్త నాటకానికి తెర తీసిండు అంటూ నిప్పులు చెరిగారు.
అవి నిజమైన దీక్షలు కావని దొంగ దీక్షలంటూ ఆరోపించారు. 24 గంటల్లో వరిని కొనాలంటూ కేంద్రానికి కేసీఆర్ ఆల్టిమేటం ఇచ్చాడు.
పార్టీ పరంగా రాష్ట్రంలో సీఎంకు తాము కూడా ఆల్టిమేటం ఇస్తున్నామని రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మధు యాష్కి(Madhu Yashki )డిమాండ్ చేశారు.
రైతులను ఇంకెంత కాలం మోసం చేస్తారంటూ సీఎంను నిలదీశారు. 2006లో కాంగ్రెస్ సర్కార్ పౌర సరఫరాల శాఖ, భారత ఆహార సంస్థతో కలిసి ఒప్పందం చేసుకుందన్నారు.
ఇందులో భాగంగానే ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించడం జరిగిందని చెప్పారు.
2014 లో కొలువు తీరిన సీఎం కేసీఆర్ రైతులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడంటూ ఆరోపించారు మధు యాష్కి గౌడ్. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కొత్త నాటకానికి సీఎం కేసీఆర్ తెర తీశాడంటూ మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ కు కాలం చెల్లిందన్నారు.
Also Read : అమిత్ షా కామెంట్స్ కేటీఆర్ సీరియస్