Madhur Verma : ఢిల్లీ ఏసీబీ చీఫ్ గా మధుర్ వర్మ
2005 బ్యాచ్ ఐపీఎఎస్ అధికారి
Madhur Verma : దేశ రాజధాని ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) హెడ్ (చీఫ్) గా మధుర్ వర్మ(Madhur Verma) నియమితులయ్యారు. ఆయన 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
మధుర్ వర్మ గతంలో ఢిల్లీ సాయుధ పోలీస్ విభాగంలో అదనపు కమిషనర్ గా పని చేశారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై ఉన్న అవినీతి కేసులను విచారించాల్సి ఉంది.
ఇదిలా ఉండగా మధుర్ వర్మ గతంలో క్రైమ్ బ్రాంచ్ , పోలీస్ నార్త్ జిల్లా, న్యూఢిల్లీ జిల్లాలకు సంబంధించి డీసీపీగా పని చేశారు. మధుర్ వర్మ 2019 వరకు ఢిల్లీ పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా కూడా ఉన్నారు.
ఇక మంగళవారం వరకు ఏసీబీకి నేతృత్వం వహించిన 1989 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ స్పెషల్ కమిషనర్ సునీల్ కుమార్ గౌతమ్ ఢిల్లీ పోలీసులకు రిపోర్టు చేయనున్నారు.
మరో అధికారి బీఎస్ జైస్వాల్ ను కూడా బదిలీ చేశారు. జైస్వాల్ ఇంతకు ముందు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ లో ఉన్నారు. జైస్వాల్ ను ఆపరేషన్స్ , టెక్నాలజీ , ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ జాయింట్ కమిషనర్ గా నియమించారు.
ఆగస్టు 15 స్వాతంత్ర వేడుకల అనంతరం , ఆగస్టు 1న 25వవ ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా సంజయ్ అరోరా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పోలీసు శాఖలో అనేక బదిలీలు జరుగుతున్నాయి.
పోలీసు శాఖలోని అన్ని విభాగాలను జల్లెడ్ పట్టారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులకు సారథ్యం వహిస్తున్న అరోరా తమిళనాడు కేడర్ కు చెందిన 1987 బ్యాచ్ పోలీస్ అధికారి కావడం విశేషం.
Also Read : బీజేపీ జాతీయ వాదానికి అర్థం లేదు