The Fame Game : నెట్ ఫ్లిక్స్ లో మాధురి ‘ది ఫేమ్ గేమ్’

మ‌రోసారి ఆక‌ట్టుకుంటున్న ముద్దుగుమ్మ‌

The Fame Game : బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు గా పేరు పొందిన వారంతా ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. కొంద‌రు సినిమాల్లో అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తున్నా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వేదిక‌గా వెబ్ సీరీస్ లో న‌టిస్తూ అల‌రిస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ లో త్వ‌ర‌లో ప్ర‌సారం కానున్న ది ఫేమ్ గేమ్ ( అనామిక త‌ప్పి పోయింది ) వెబ్ సీరీసీకు సంబంధించిన ట్రైల‌ర్ ను రిలీజ్ చేసింది. ఇందులో మాధురీ దీక్షిత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు.

ఈ సీరీస్ అనామికా ఆనంద్ జీవితం ఆధారంగా రూపొందించారు ద‌ర్శ‌కుడు. ఈ షోను క‌ర‌ణ్ జోహార్ కు చెందిన ధ‌ర్మాటిక్ నిర్మిస్తోంది.

ఇందులో మాధురీ దీక్షిత్ తో పాటు సంజ‌య్ క‌పూర్ , మాన‌వ్ కౌల్ , రాజ‌శ్రీ దేశ్ పాండే, ముస్కాన్ జాఫ్రీ, ల‌క్వీర్ సింగ్ స‌ర‌న్, గ‌గ‌న్ అరోరా, సుహాసిని ములే, శుబాంగి లట్క‌ర్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.

ఈ వెబ్ సీరీస్ ఈనెల 25న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియ‌ర్ గా ప్ర‌ద‌ర్శిస్తారు. ఫేమ్ గేమ్ ట్రైల‌ర్(The Fame Game) ఆక‌ట్టుకునేలా ఉంది. రెడ్ కార్పెట్ పై అనామికా ఆనంద్ ( మాధురీ దీక్షిత్ ) షాట్ ల‌తో ప్రారంభ‌మ‌వుతుంది.

నేను ఒక త‌ల్లి, భార్య‌, కూతురు మాత్ర‌మే కాదు. నాకు ట‌చ్ వుడ్ అనే కుటుంబం కూడా ఉంది. అన్న డైలాగ్ తో మాధురీ మెస్మ‌రైజ్ చేసింది మ‌రోసారి. ప‌రిశోధ‌న‌, కుటుంబం, రిలేష‌న్ షిప్ ..ఉత్కంఠ‌తో కూడిన వెబ్ సీరీస్ ఇది అని క‌ర‌ణ్ జోహార్ పేర్కొన్నారు.

ది ఫేమ్ గేమ్ ట్రైల‌ర్ లో అనామికా ఆనంద్ జీవితంలోని వివిధ స‌న్నివేశాలు ఉన్నాయి. హిందీ, ఇంగ్లీష్ ల‌లో ప్రసారం కానున్న ఈ వెబ్ సీరీస్ కు క‌రిష్మా కోహ్లీ, బెజోయ్ నంబియార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ రావు సీరీస్ రాశారు.

Also Read : మా ‘పుష్క‌ర్’ ఫ్ల‌వ‌ర్ కాదు ఫైర్ ఉన్నోడు

Leave A Reply

Your Email Id will not be published!