Madhya Pradesh CM : జేపీ న‌డ్డాతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం భేటీ

కీల‌క అంశాల‌పై ప్ర‌త్యేక చ‌ర్చ

Madhya Pradesh CM :  భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్ల‌మెంట‌రీ బోర్డు నుంచి తొల‌గించిన త‌ర్వాత మొద‌టిసారిగా మ‌ధ్య ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డాను క‌లిశారు.

అనంత‌రం కేంద్ర స్త్రీ శిశు కుటుం అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీతో భేటీ అయ్యారు. న‌డ్వా నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

కాగా ఈనెల ప్రారంభంలో పార్టీ పార్ల‌మెంట‌రీ బోర్డు అత్యున్న‌త నిర్ణ‌యాధికార సంస్థ నుండి తొల‌గింపున‌కు గుర‌య్యారు. ఇది ఒక ర‌కంగా బిగ్ షాక్ . మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎంతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు కూడా కోలుకోలేని షాక్ త‌గిలింది.

చౌహాన్ , యోగితో పాటు కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గ‌డ్క‌రీని కూడా త‌ప్పించారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసింది.

ఈ స‌మావేశంలో ప‌లు సంస్థాగ‌త అంశాలు, వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల ప్లాన్ పై చ‌ర్చించారు ఈ సంద‌ర్భంగా. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌జా సంక్షేమం కోసం చేస్తున్న ప‌నులు, ప్ర‌య‌త్నాల గురించి జేపీ న‌డ్డాకు తెలియ చేశారు.

కాగా రాష్ట్ర అభివృద్దికి సంబంధించి జేపీ న‌డ్డా అందిస్తున్న నిరంత‌ర స‌హ‌కారం, మ‌ద్ద‌తు, మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్నందుకు జేపీ న‌డ్డాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్(Madhya Pradesh CM).

అంతకు ముందు సీఎం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో భేటీ అయ్యారు. అనంత‌రం రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును కూడా మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు.

Also Read : రాజ్ థాక‌రేతో బీజేపీ చీఫ్ స‌మావేశం

Leave A Reply

Your Email Id will not be published!