Pragya Thakur & Aparna Yadav : ఆ ఇద్దరికీ దుబాయి లింక్ కాల్
నిన్న ప్రగ్యా ఠాకూర్ మొన్న అపర్ణా యాదవ్
Pragya Thakur & Aparna Yadav : మధ్య ప్రదేశ్ పోలీసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కు తాజాగా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు తనను చంపుతానంటూ బెదిరించాడని ఫిర్యాదు చేశారు.
ఈ తరుణంలో విచారణ జరిపిన పోలీసులు కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కు వచ్చిన దుబాయ్ లింక్ కాల్ గతంలో యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కోడలు, బీజేపీ నాయకురాలు అపర్ణా యాదవ్(Pragya Thakur & Aparna Yadav) కు కూడా ఈ కాల్ నుంచే వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో దీనిని పోలీసులు దుబాయ్ లింక్ కాల్ గా పేర్కొన్నారు. అయితే వచ్చిన కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు ప్రారంభమైందన్నారు.
సోమవారం దుబాయ్ లింక్ కాల్ పై వెల్లడించారు. కాల్ చేసేందుకు ప్రాక్సీ సర్వర్ ని ఉపయోగించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ తో పాటు అపర్ణా యాదవ్ కు వచ్చిన కాల్ ఒకటేనని , దగ్గరి సంబంధం ఉందనే కోణంపై విచారణ ప్రారంభించామని తెలిపారు.
ఇద్దరూ నాయకురాళ్లు భారతీయ జనతా పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఎంపీ ఠాకూర్ కు శనివారం ఒక కాల్ వచ్చింది.
అందులో కాల్ చేసిన వ్యక్తి తనను తాను పరారీలో ఉన్న మాఫియా డాన్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ గా పరిచయం చేసుకున్నాడు. ఇదే విషయాన్ని ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read : దేశం కోసం కఠిన నిర్ణయాలు తప్పదు – మోదీ