Maharashtra Cabinet : మరాఠా కేబినెట్ లో ఉండేదెవరో
మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ
Maharashtra Cabinet : మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేసి సీఎం పీఠంపై కూర్చున్న ఏక్ నాథ్ షిండే , బీజేపీ కూటమి మంత్రివర్గ కూర్పుపై ఇంకా సందిగ్ధత నెలకొంది. ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై టెన్షన్ నెలకొంది.
కొత్త సర్కార్ కొలువు తీరినా కేవలం ఇద్దరితోనే నెట్టుకు వస్తోంది మరాఠా ప్రభుత్వం. ఒకరు సీఎం ఏక్ నాథ్ షిండే మరొకరు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.
విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం పూర్తి కేబినెట్ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని టాక్. పూర్తి లిస్టు ను ట్రబుల్ షూటర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కు షిండే, ఫడ్నవీస్ సమర్పించారు.
ఇక భారతీయ జనతా పార్టీ కోటా నుంచి మంత్రి పదవుల కోసం ఆ పార్టీ నేతలు చంద్రకాంత్ పాటిల్ , సుధీర్ ముంగంటి వార్ , రాధాకృష్ణ విఖే పాటిల్ , గిరీష్ మహా జన్ , సురేష్ ఖాడే పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక శివసేన రెబల్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మంత్రుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు టాక్. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టిన 40 రోజుల తర్వాత కేబినెట్ విస్తరణ (Maharashtra Cabinet) జరగనుంది.
సర్కార్ కొలువు తీరినా ఈరోజు వరకు కేబినెట్ ఏర్పాటు చేయక పోవడాన్ని విపక్షాలు మండిపడ్డారు. ఇక శివసేన రెబల్స్ తరపు నుంచి దాదా భూసే, ఉదయ్ సమంత్ , గులాబ్రావ్ పాటిల్ , సందీపన్ భూమారే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు.
ఇక 2019లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారిన విఖే పాటిల్ కూడా కేబినెట్ బెర్త్ దక్కనుందని సమాచారం.
Also Read : సాంకేతిక లోపం గూగుల్ కు అంతరాయం