Maharastra Governor CM : బలపరీక్షకు ఆదేశం రేపే ముహూర్తం
ఉద్దవ్ సర్కార్ కు గవర్నర్ డెడ్ లైన్
Maharastra Governor CM : మహారాష్ట్ర సంక్షోభానికి తెర పడేందుకు మార్గం సుగమం చేశారు రాష్ట్ర గవర్నర్ కోషియార్. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో ఉన్నట్టుండి రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే సారథ్యంలో శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించారు.
ఇప్పటికే అస్సాం లోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో మకాం వేశారు. ఈ మేరకు మైనార్టీలో ఉన్న ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకునేలా ఆదేశాలు జారీ చేయాలని భారతీయ జనతా పార్టీ చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ కోషియార్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
ఇదిలా ఉండగా గత 9 రోజులకు పైగా మరాఠా సంక్షోభం కొనసాగుతూ వస్తోంది. ఈ తరుణంలో గవర్నర్ కు ఉన్నట్టుండి కరోనా సోకడంతో ఆస్పత్రి పాలయ్యారు.
చికిత్స అనంతరం మరాఠాకు వచ్చారు. దీంతో బుధవారం బల పరీక్ష నిరూపించు కోవాలని ప్రస్తుత మహా వికాస్ అఘాడి సీఎం ఉద్దవ్ ఠాక్రేను(Maharastra Governor CM) గవర్నర్ ఆదేశించారు.
గురువారం ఈనెల 30న బల నిరూపణకు రెడీ కావాలని స్పష్టం చేశారు. అదే రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. రేపు సాయంత్రం 5 గంటల లోగా తమ బలాన్ని నిరూపించాలని పేర్కొన్నారు.
ఇదే సమయంలో బల పరీక్షను రికార్డ్ కూడా చేయాలని ఆదేశించారు రాష్ట్ర గవర్నర్. ఇదిలా ఉండగా బల నిరూపణ తర్వాత తమ యాక్షన్ ప్లాన్ ఏమిటో ప్రకటిస్తామని స్పష్టం చేశారు ఏక్ నాథ్ షిండే.