Nupur Sharma : నూపుర్ శర్మకు మరాఠా పోలీస్ షాక్
హాజరు కావాలంటూ సమన్లు
Nupur Sharma : మహ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను భారతీయ జనతా పార్టీకి చెందిన అధికార ప్రతినిధి నూపుర్ శర్మ(Nupur Sharma) తో పాటు ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ చార్జ్ నవీన్ కుమార్ జిందాల్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. ఆపై ప్రపంచ వ్యాప్తంగా 51 దేశాలలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ ఇద్దరిని
అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు ఆందోళనకారులు.
ఇదిలా ఉండగా ప్రవక్త గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నూపుర్ శర్మకు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ మేరకు సమన్లు జారీ చేశారు. ఈనెల 25న స్టేట్ మెంట్ రికార్డ్ చేసేందుకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమ ముందు హాజరు కావాలని కోరుతూ థానే లోని ముంబ్రా పోలీసులు కోరారు. అంతే కాకుండా ప్రవక్త మహమ్మద్ పై వివాదాస్పద ట్వీట్లు చేసిన
ఆరోపణలపై ఈనెల 15న రావాల్సిందిగా మరో బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నవీన్ కుమార్ జిందాల్ కు నోటీసులు జారీ చేశారు పోలీసులు.
ఈ విషయాన్ని సీనియర్ పోలీస్ ఇన్స్ పెక్టర్ చేతన్ కకడే ఆదివారం మీడియాకు వెల్లడించారు. గత నెల 30న రజా అకాడమీ ప్రతినిధి చేసిన
ఫిర్యాదు మేరకు భీవండి పోలీసులు నూపుర్ శర్మ(Nupur Sharma) పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అంతే కాకుండా తాను మాట్లాడిన వీడియోను కూడా తీసుకు రావాలని సూచించారు. ఇదిలా ఉండగా నూపుర్ శర్మ వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఆమె కామెంట్స్ దెబ్బకు ఇవాళ దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఘర్షణలు, ఆందోళనలు, నిరసనలు చోటు చేసుకున్నాయి.
ఇదిలా ఉండగా ఎంపీ సాధ్వి ప్రగ్యా నూపుర్ శర్మకు మద్దతుగా నిలిచారు. ఈనెల 5న బీజేపీ నూపుర్ శర్మను పార్టీ నుంచి బహిష్కరించింది.
Also Read : గ్రామ స్వరాజ్యం దేశానికి ఆదర్శం