Mahela Jayawardene : ఆడితే ఓకే లేదంటే వేటే – జ‌య‌వ‌ర్ద‌నే

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన హెడ్ కోచ్

Mahela Jayawardene : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022లో అరుదైన స‌న్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ఐపీఎల్ హిస్ట‌రీలో అత్య‌ధిక విజ‌యాలు న‌మోదు చేసిన జ‌ట్టుగా పేరుంది ముంబై ఇండియ‌న్స్ టీమ్ కు. దీనిని రిల‌య‌న్స్ గ్రూప్ కొనుగోలు చేసింది.

2008 నుంచి నేటి దాకా కోట్లాది రూపాయ‌లు పోసి ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేస్తూ వ‌స్తోంది. ప్ర‌ధానంగా రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని ముంబై ఇండియ‌న్స్ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లుసార్లు టైటిళ్ల‌ను కైవ‌సం చేసుకుంది.

ఇదిలా ఉండ‌గా దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన 2021 ఐపీఎల్ టోర్నీలో ముంబై ప్లే ఆఫ్స్ కు చేరుకోకుండానే వెనుదిరిగింది. కానీ ఈసారి ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న 15వ రిచ్ లీగ్ లో అత్యంత దారుణ‌మైన‌, చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేసి తీవ్రంగా నిరాశ ప‌ర్చింది.

ఇప్ప‌టి వ‌ర‌కు 8 మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియ‌న్స్ ఏ ఒక్క మ్యాచ్ లో విజ‌యం సాధించ లేక పోయింది. స్టార్ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ పేల‌వ‌మైన ఆట తీరుతో ఓట‌మి మూట‌గ‌ట్టుకుంటోంది.

దీంతో హెడ్ కోచ్ గా ఉన్న శ్రీ‌లంక క్రికెట్ దిగ్గ‌జం మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే (Mahela Jayawardene) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఎవ‌రైనా స‌రే ఆడితే ఓకే లేదంటే వేటు వేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చాడు. ఆడేందుకు ఇంక్కొక్క సారి అవ‌కాశం ఇస్తాన‌ని, లేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పేర్కొన్నాడు మ‌హేళ‌.

రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ దారిలోకి రావాల‌న్నాడు. తిల‌క్ వ‌ర్మ అద్భుతంగా రానిస్తున్నాడ‌ని తెలిపాడు. పొలార్డ్ ఫామ్ లేక ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని, బ్రేవోస్ కు ఛాన్స్ ఇస్తామ‌న్నాడు.

బౌలింగ్ ప‌రంగా మారాల్సి ఉంద‌న్నాడు. బుమ్రా, సామ్స్ , మెరిడిత్ ఎక్కువ ప‌రుగులు ఇస్తు్న్నార‌ని మార్చు కోవాల‌న్నాడు.

Also Read : శిఖ‌ర్ ధావ‌న్ ధ‌నా ధ‌న్

Leave A Reply

Your Email Id will not be published!