Mahela Jayawardene : ప‌ని చేయ‌ని ‘మ‌హేళ’ మంత్రం

ముంబై ప‌రాజ‌యం కంటిన్యూ

Mahela Jayawardene  : ఐపీఎల్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ లు కొన‌సాగుతున్నాయి. కానీ ఒకే ఒక్క జ‌ట్టు మాత్రం తీవ్ర నిరాశ‌కు గురి చేస్తూ వ‌స్తోంది అభిమానుల్ని.

గ‌త సీజ‌న్ లో 8 జ‌ట్లు పాల్గొంటే ఈ సీజ‌న్ లో 10 జ‌ట్లు పార్టిసిపేట్ చేస్తున్నాయి. కొత్త‌గా గుజ‌రాత్, ల‌క్నో జ‌ట్లు చేరాయి. ఊహించ‌ని రీతిలో దుమ్ము రేపుతున్నాయి.

పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ కు క‌చ్చితంగా వెళ్లే జ‌ట్ల‌లో అవి ఉండ‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా ప్ర‌తి జ‌ట్టు విజ‌యం వెనుక కెప్టెన్ తో పాటు హెడ్ కోచ్ ప్ర‌ధాన పాత్ర వ‌హిస్తాడు.

అత‌డి ప‌ని ఒక్క‌టే. నాయ‌కుడు సార‌థి అయితే ప్ర‌ధాన శిక్ష‌కుడు ర‌థ‌సార‌థి. ఇప్ప‌టి దాకా ఐపీఎల్ 14 సీజ‌న్లు కొన‌సాగింది. ఇందులో అత్య‌ధిక విజ‌యాలు (టైటిళ్లు) గెలిచింది మాత్రం రెండు జ‌ట్లు.

ఒక‌టి చెన్నై సూప‌ర్ కింగ్స్ కాగా మ‌రొక‌టి ముంబై ఇండియ‌న్స్ . కానీ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు దిశా నిర్దేశం చేస్తూ అద్బుత‌మైన జ‌ట్టుగా

తీర్చి దిద్ద‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తూ వ‌స్తుంది మాత్రం ఆ జ‌ట్టు హెడ్ కోచ్ గా ఉన్న శ్రీ‌లంక క్రికెట్ మాజీ దిగ్గ‌జం మ‌హేళ జ‌య‌వ‌ర్ద‌నే(Mahela Jayawardene ).

ఇంకో స్టార్ మాజీ ప్లేయ‌ర్ కుమార సంగ‌క్క‌ర రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు డైరెక్ట‌ర్ గా ఉన్నాడు.

కానీ ముంబై వ‌రుస‌గా ఎనిమిది మ్యాచ్ లు ఓడి పోవ‌డం అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు.

రేపు జ‌రిగే మ్యాచ్ ల‌లో కూడా ఆ జ‌ట్టు గెలుస్తుంద‌న్న గ్యారెంటీ లేదు.

దీంతో హెడ్ కోచ్ ను మారుస్తుందా లేక తానే మారి పోతాడా లేక జ‌ట్టు ఓటమికి బాధ్య‌త వ‌హిస్తూ రోహిత్ శ‌ర్మ త‌ప్పుకుంటాడా తెలియాల్సి ఉంది.

జ‌య‌వ‌ర్ద‌నే ప్లాన్ గీస్తాడు. కానీ మైదానంలో ఆడాల్సింది మాత్రం ఆట‌గాళ్లే.

వాళ్లు ఆడ‌క పోతే మ‌హేళ ఏం చేయ‌గ‌ల‌డు. ఏది ఏమైనా జ‌ట్టు జ‌యాప‌జ‌యాలు హెడ్ కోచ్ , కెప్టెన్ పై ఆధార‌ప‌డి ఉంటాయి.

మ‌రి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది. జ‌ట్టు గెలిస్తే ఓకే లేదంటే క‌ష్ట‌మే.

Also Read : మ‌హిళ‌ల‌ ఐపీఎల్ కు లైన్ క్లియ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!