Mahipal Reddy Tomato : టమాట అమ్మి 1Cr సంపాదించినా రైతు
రూ. కోటికి పైగా ఆర్జించిన రైతన్న
Mahipal Reddy Tomato : ఒక్కోసారి అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు టమాటా పండించే రైతులంటే చులకన. కానీ ఇప్పుడు ఆ రైతులకు , టమాటకు ఎక్కడా లేనంతటి డిమాండ్(Tomato Crisis) ఏర్పడింది. అది ఏకంగా కోటి రూపాయలు సంపాదించేలా చేసింది.
Mahipal Reddy Tomato Price
ప్రస్తుతం మార్కెట్ లో టమాటా కూరగాయకు భారీ డిమాండ్ ఏర్పడింది. నిన్నటి దాకా రూ. 10 కేజీ ఉన్న టమోటా ఇప్పుడు బహిరంగ మార్కెట్ లో రూ. 130 నుంచి 150 దాకా కేజీ ధర పలుకుతోంది. దీంతో టమాటా పండించిన రైతు పంట పండింది. కేవలం ఒకే ఒక్క నెలలో లక్ అతడిని పలకరించింది. కోటీశ్వరుడిని చేసిన ఆ రైతు ఎవరో కాదు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి.
మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన రైతు మహిపాల్ రెడ్డి. ఆయన 8 ఎకరాలలో 20 ఏళ్లుగా టమాటా పండిస్తున్నారు. ఆయన చదువుకున్నది కేవలం 10వ తరగతి మాత్రమే. కానీ నెల రోజుల్లో కోటికి పైగా ఆర్జించాడు.
ఈ ఒక్క సీజన్ లో ఏకంగా 7,000 బాక్సులను అమ్మాడు. ఒక్కో బాక్సును రూ. 2,600కు విక్రయించాడు. ప్రస్తుతం ఆయన వయస్సు 36 ఏళ్లు. భార్య సహకారంతో కూరగాయలు పండించడం స్టార్ట్ చేశాడు. ఆయన భార్య దివ్య ప్రస్తుతం మహ్మద్ నగర్ సర్పంచ్ గా కొనసాగుతున్నారు.
Also Read : Google AI Journalists : జర్నలిస్టుల కోసం గూగుల్ ఏఐ