Mahmood Qureshi : పాకిస్తాన్ భూ భాగంపై భారత్ కు చెందిన క్షిపణి కూలి పోయింది. దీనిపై ఇప్పటికే అంతర్జాతీయ పరంగా చర్చకు దారి తీసింది. పొరపాటు జరిగిందని సాక్షాత్తు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభ సాక్షిగా ప్రకటించారు.
దీనిపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ తరుణంలో పాకిస్తాన్ దేశ ప్రధాన మంత్రి, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్(Mahmood Qureshi) సీరియస్ అయ్యారు. తప్పైందని అన్నారు కాబట్టి తాము ఊరుకున్నామని లేక పోతే ఇండియాపై యుద్దానికి దిగే వారమని చెప్పారు.
దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి సైతం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కావాలని క్షిపణి ప్రయోగించ లేదని ప్రతి సారి పరీక్షల్లో భాగంగా టెస్టింగ్ జరిపే తరుణంలో పొరపాటున పాకిస్తాన్ భూ భాగంలో పేలిందని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది కూడా.
తాజాగా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది పాకిస్తాన్. మరోసారి అంతర్జాతీయంగా చర్చకు తీసుకు వచ్చేలా డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించి ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ ఖురేషి (Mahmood Qureshi)మళ్లీ స్పందించారు.
తమ భూ భాగంలో పడ్డ భారత్ కు చెందిన మిస్సైల్ పై సంయుక్త విచారణ జరిపించాలని అన్నారు. బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇచ్చిన వివరణ సరిగా లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం సరి పోదన్నారు.
Also Read : రష్యాకు అంత సీన్ లేదు