Mahua Moitra : 10 నిమిషాల లోపు డెలివరీపై ఎంపీ ఫైర్
పార్లమెంట్ లో దీనిపై ప్రస్తావిస్తా మహూవా
Mahua Moitra : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ మహూవా మొయిత్రా సంచలన కామెంట్స్ చేశారు. ఆమె ప్రధానంగా ఇటీవల జోరుగా ప్రచారం చేసుకుంటున్న ఈ కామర్స్ సంస్థల ప్రకటనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఫుడ్, ఇతర వస్తువులకు సంబంధించి జొమాటో తన యాడ్ లో ఆర్డర్ చేయండి కేవలం 10 నిమిషాల్లో డెలివరీ అందుకోండి అంటూ చెబుతోంది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఎంపీ మహూవా మొయిత్రా(Mahua Moitra).
ఇలాంటి సేవలు అనేవి పక్కన పెడితే దీని వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందన్నారు. కేవలం 10 నిమిషాల్లో ఎవరూ డెలివరీ చేయలేరు. ఒక వేళ చేసినా అంత స్పీడ్ గా జొమాటో రిప్రజెంటిటివ్స్ ఎలా వాటిని అందజేస్తారో చెప్పాలన్నారు.
ఢిల్లీ లాంటి ముఖ్య నగరాలలో నడకతో పాటు ప్రయాణం తీవ్ర ఇబ్బందులకు లోనవ్వడం ఖాయం. మధ్యలో చెప్పలేనంత ట్రాఫిక్ జామ్ కావడం ఖాయం.
ఈ సమయంలో కేవలం 10 నిమిషాల లోపే ఆర్డర్ చేసిన వాటిని అందజేయాలంటే 90 కిలోమీటర్ల కంటే ఎక్కువగా నడిపితేనే వాళ్లు డెలివరీ ఇవ్వగలరు. దీన్ని కంటిన్యూ చేస్తే ఒకటి ట్రాఫిక్ రూల్స్ ను అధిగమించాలి.
ఇంకో విషయం ఎక్కువగా స్పీడ్ గా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు మహూవా మొయిత్రా(Mahua Moitra).
జొమాటో తో పాటు స్విగ్గీ లాంటి ఈ కామర్స్ ఫుడ్ డెలివరీ కంపెనీల వ్యవహారాలపై తాను పార్లమెంట్ సాక్షిగా లేవదీస్తానని ఎంపీ హెచ్చరించారు. ప్రస్తుతం మహూవా మొయిత్రా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : సిద్దరామయ్యపై బొమ్మై గరం గరం