Mahua Moitra Harish Salve : హరీష్ సాల్వేపై మహూవా ఫైర్
నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ
Mahua Moitra Harish Salve : సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేపై నిప్పులు చెరిగారు టీఎంసీ ఎంపీ మహూమా మోయిత్రా(Mahua Moitra Harish Salve). అదానీ గ్రూప్ వివాదంపై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సాల్వే.
శనివారం ట్విట్టర్ వేదికగా సీరియస్ గా స్పందించారు. మిస్టర్ నాగ్ పూర్ వకీల్ సాబ్ అంటూ వ్యక్తిగత కామెంట్స్ చేయడం కలకలం రేపింది. దేశంలోని రెండో అతి పెద్ద సమ్మేళనం అయిన అదానీ గ్రూప్ కు సంబంధించి ఏవైనా నియంత్రణ వైఫల్యాలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఆదేశించింది.
అదానీ కంపెనీలు మార్కెట్ మోసాలను, ఇతర మోసపూరిత విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ నివేదికలో యుఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు కు ఆదేశించాలని కోరుతూ భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు సెబీని ఆదేశించింది. నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. కేంద్రం జోక్యం తగదని కూడా పేర్కొంది.
షేర్లను తగ్గించడం ద్వారా భారీగా డబ్బు సంపాదించిన వారందరినీ కమిటీ కనుగొనాలని సాల్వే పేర్కొన్నారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత భారీ ఎత్తున అదానీ సంస్థలు నష్ట పోయాయి. కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న గౌతం అదానీ ఏకంగా 22వ స్థానానికి పడి పోయాడు. ఈ మొత్తం వ్యవహారంపై హరీష్ సాల్వే భిన్నంగా స్పందించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది ఎంపీ మహూవా మోయిత్రా(Mahua Moitra).
Also Read : ఆరోగ్య రంగంలో భారత్ కృషి భేష్