Mahua Moitra : ప్రధాని మోదీపై టీఎంసీ ఆగ్రహం
జాతీయ చిహ్నంకు అవమానం
Mahua Moitra : భారత దేశానికి సంబంధించిన జాతీయ చిహ్నాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవమానించారంటూ తృణమూల్ కాంగ్రెస పార్టీ (టీఎంసీ) ఆరోపించింది. మంగళవారం ఎంపీలు జవహార్ సిర్కార్ , మహూవా మోయిత్రా(Mahua Moitra) నిప్పులు చెరిగారు.
రూ. 1200 కోట్లకు పైగా అంచనాతో దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే అక్టోబర్ నెలాఖరు వరకు భవనాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జాతీయ చిహ్నంలో సింహాన్ని దుందుడుకుగా అసందర్భంగా చూపుతూ ఈ చిహ్నాన్ని కావాలని అపహాస్యం చేశారంటూ మండిపడ్డారు. గాంభీర్యానికి, నిబ్బరానికి సింహం ప్రతీకగా ఉండేలా గతంలో పార్లమెంట్ ముందు ఏర్పాటు చేశారని తెలిపారు.
కానీ కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని మాత్రం పూర్తిగా విరుద్దంగా తయారు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిహ్నంలో ప్రత్యేకంగా సింహాన్ని దుందుడుకుగా, కోపంతో ఉన్నట్లు అసందర్భంగా తయారు చేశారని పేర్కొన్నారు.
ఈ రకంగా జాతీయ చిహ్నాన్ని అవమానించిన ప్రధాన మంత్రి దేశానికి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీఎంసీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ ఫైర్ అయ్యారు.
ఇది జాతిని అవమాన పర్చడమేనని, తక్షణమే జాతీయ చిహ్నంను మార్చాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా గతంలో జాతీయ చిహ్నం తో పాటు కొత్తగా తయారు చేసిన ప్రస్తుత చిహ్నాన్ని పక్క పక్కన ఉంచిన ఫోటోలతో ఎంపీ మహూవా మోయిత్రా(Mahua Moitra) ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఎంపీ చేసిన ఈ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : రాఘవ్ చద్దాజీ జీతే రహో – సీఎం