Ghulam Nabi Azad : ట్రబుల్ షూటర్ తో నేతల భేటీ
కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని బిగ్ షాక్
Ghulam Nabi Azad : 134 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేని రీతిలో యువ నాయకుడు రాహుల్ గాంధీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విమర్శల జడి వాన కురుస్తోంది. ప్రధానంగా పార్టీని వీడుతున్న వారంతా రాహుల్ ను టార్గెట్ చేయడం విస్తు పోయేలా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం వినిపించిన వారంతా ఇప్పుడు పార్టీని వీడే ప్రయత్నంలో ఉన్నారు.
పార్టీకి పిల్లర్ గా ఉంటూ వచ్చిన ఆజాద్ ఉన్నట్టుండి 50 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు. ఆయన గుడ్ బై చెప్పిన వెంటనే పలువురు నాయకులు తాము తప్పుకుంటున్నట్లు డిక్లేర్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఏఎం ఖాన్ రాజీనామా చేశారు. ఆయన వెళుతూ వెళుతూ సంచలన ఆరోపణలు చేశారు. యువ నాయకుడు రాహుల్ గాంధీ నిర్వాకం వల్లనే పార్టీ ఇలా వెనక్కి వెళుతోందంటూ మండిపడ్డారు.
భవిష్యత్తులో పార్టీ బాగుపడే అవకాశాలు కనిపించడం లేదంటూ పేర్కొన్నారు. మరో వైపు హిమాచల్ ప్రదేశ్ , జమ్మూ కాశ్మీర్ , తదితర రాష్ట్రాలలో గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) మనుషులుగా ముద్ర పడిన వారు, అనుచరులు, జీ23లో అసమ్మతి గళాన్ని వినిపించిన నాయకులంతా ఆదివారం ఆజాద్ నివాసంలో భేటీ అవుతున్నారు.
తమ భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇదే సమయంలో ఏఐసీసీ కీలక సమావేశం కానుంది ఇవాళే. పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ఎవరనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. కాంగ్రెస్ పార్టీని బీజేపీ మునిగి పోతున్న పడవగా అభివర్ణించింది.
Also Read : పేరుకే ఖాదీ అంతా చైనీస్ పాలిస్టరే