Malla Reddy: కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి ?
కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి ?
Malla Reddy: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు భారీ షాక్ తగలబోతోందా… అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కేసీఆర్ కు బైబై చెప్పడానికి సిద్ధమౌతున్నారు. కారుకు టాటా చెప్పి కాంగ్రెస్ తో చేతులు కలపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని మల్లారెడ్డి, మరో నేత మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం కలిసినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఓ హోటల్లో డీకే శివకుమార్ తో ఈ ఇద్దరు నాయకులు మంతనాలు జరిపారు. కాంగ్రెస్ లో చేరేందుకు ఇరువురు దాదాపు సిద్ధమయినట్లు సమాచారం. ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరారు. దీన్ని బట్టి అతి త్వరలోనే మల్లారెడ్డి(Malla Reddy) కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి… గురువారం డీకే శివకుమార్ ను కలిసిన ఫోటో ఇప్పుడు నెట్టంట వైరల్ గా మారుతోంది.
Malla Reddy Will Join..
గత కొద్ది రోజులుగా మల్లారెడ్డి పార్టీ మారుతారని… కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ వారం పదిరోజుల క్రితం ప్రభుత్వ సలహారాదు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ అయ్యారు. దీనితో మల్లారెడ్డి పార్టీ మారుతారు అనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే ఇది జరిగి 24 గంటలు తిరగకముందే… మల్లారెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాను పార్టీ మారబోనని మల్లారెడ్డి… కేసీఆర్ తో తేల్చి చెప్పినట్లు ప్రచారం జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బరిలోకి దిగుతారని గతంలో ప్రకటించారు. అయితే భద్రారెడ్డి పోటీ చేయడం లేదని మరల మల్లారెడ్డి ప్రకటించారు. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలవడంతో మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమనే ప్రచారం జరగుతోంది.
Also Read : OTT Platforms: 18 ఓటీటీలపై నిషేదం విధించిన కేంద్రం !