Malli Pelli Aha: ప్రముఖ నటుడు నరేష్ , పవిత్ర లోకేష్ కలిసి నటించిన మళ్లీ పెళ్లి(Malli Pelli)చిత్రం ఇప్పటికే విడుదలైంది. ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫారమ్ లోకి వస్తోంది. తాజాగా జూన్ 23న ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని బుధవారం ట్విట్టర్ వేదికగా ఆహా ప్రకటించింది. ప్రేమ, రెండో దశలో కలిగే రొమాంటిక్ ఫీలింగ్స్ , తోడు ఒకరుంటే బావుండననిపించే సన్నివేశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ప్రముఖ నిర్మాత రాజు ఈ మళ్లీ పెళ్లికి దర్శకుడు కావడం విశేషం. దీనిపై విపరీతమైన అంచనాలు ఉన్నప్పటికీ ఆశించిన మేర సక్సెస్ కాలేదని ప్రచారం జరిగింది.
నరేష్ ప్రముఖ నటుడు కృష్ణ తనయుడు. ఆయన సోదరుడు మహేష్ బాబు. ఇక పవిత్ర లోకేష్ కు ఇప్పటికే పెళ్లి అయ్యింది. ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసింది. గతంలో పెళ్లి చేసుకున్న భార్య తీవ్రమైన ఆరోపణలు చేసింది నరేష్ పై. చివరకు వీరిద్దరూ కలిసి తాము ఒక్కటైనట్లు ప్రకటించారు. ఆ మేరకు ఇద్దరూ లిప్ కిస్ పెట్టుకుని సంచలనం సృష్టించారు. ఆ ఫోటోలు ఇప్పటికీ నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ఒక ఏజ్ వచ్చాక తోడు ఎంత ముఖ్యమైన అవసరమో చెప్పకనే చెప్పింది ఈ సినిమా. చూసే వాళ్లకు ఒక్కో రీతిన అనిపిస్తుందని పేర్కొన్నారు దర్శకుడు. ఏది ఏమైనా మనుషుల మధ్య భావోద్వేగాలను అర్థం చేసుకోక పోతే ఇబ్బందులు తలెత్తక మానవు. మళ్లీ పెళ్లి ప్రేమ, సవాళ్లు, ఆనందాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నం చేశారు దర్శకుడు.
Also Read : Satya Pal Malik : ఉపేక్షిస్తే దేశం మణిపూర్ అవుతుంది
