Mallika Sagar WPL 2023 : ఐపీఎల్ వేలంలో మెరిసిన‌ ‘మ‌ల్లిక’

ఎవ‌రీ మ‌ల్లికా సాగ‌ర్ ఏమిటా క‌థ

Mallika Sagar WPL 2023 : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్వ‌హించిన వేలం పాట ముగిసింది. ముంబై వేదిక‌గా జ‌రిగిన ఈ వేలంపాట‌లో ఐదు ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. త‌మ జ‌ట్ల‌కు కావాల్సిన 90 మందిని ఎంపిక చేసుకున్నాయి. ఇందులో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయింది ముంబై స్టార్ హిట్ట‌ర్ స్మృతి మంధాన‌.

అయితే ఈ వేలం పాట‌లో ఒక‌రు మాత్రం సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ఆమె ఎవ‌రో కాదు మ‌ల్లికా సాగ‌ర్(Mallika Sagar WPL 2023). ఆమెనే ఐపీఎల్ ఆక్ష‌న్ ను నిర్వ‌హించింది. ఇంత‌కు ముందు ప్రో క‌బ‌డ్డీ లీగ్ వేలం పాట‌ను కూడా ఆమెనే చేప‌ట్టింది.

ఇక ఈ వేలం పాటలో 1525 మంది త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకుంటే ఇందులో బీసీసీఐ 409 మంది ప్లేయ‌ర్ల‌ను ఎంపిక చేసింది. వీరిలో 246 మంది భార‌తీయ మ‌హిళా క్రికెట‌ర్లు ఉండ‌గా మిగిలిన వారిలో 163 మంది విదేశీ క్రికెట‌ర్లు , 163 మంది అసోసియేట్ దేశాల నుండి వ‌చ్చారు. ఇక బీసీసీఐ ఏరికోరి వేలం పాట చేప‌ట్టేందుకు మ‌ల్లికా సాగ‌ర్ ను నియ‌మించింది. ఆమె స్వ‌స్థ‌లం ముంబై. ఆర్ట్ క‌లెక్ట‌ర్ , క‌న్స‌ల్టెంట్ గా గుర్తింపు పొందారు. భార‌తీయ క‌ళ‌పై గొప్ప ఆస‌క్తి ఉంది.

2021లో వేలం పాట అద్భుతంగా చేప‌ట్టింది. 20021లో బ్రిటీష్ వేలం హౌస్ అయిన క్రిస్టీస్ లో వేలం పాట‌లో పాల్గొంది. ఆమె భార‌తీయ సంత‌తికి చెందిన మొద‌టి మహిళ‌. ఇదిలా ఉండ‌గా గ‌తంలో జ‌రిగిన ఐపీఎల్ వేలం పాట‌కు సంబంధించిన పాత వీడియోల‌ను చూసి మ‌ల్లికా సాగ‌ర్ ఉమెన్ ఐపీఎల్ వేలం పాట‌ను(Mallika Sagar WPL 2023) నిర్వ‌హించింది. మొత్తంగా మ‌ల్లికా సాగ‌ర్ సెంట‌ర్ ఆఫ్ ది అట్రాక్ష‌న్ గా మార‌డం విశేషం.

Also Read : ష‌మీ మ్యాచ్ ఫిక్సింగ్ పై శ‌ర్మ కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!