Manish Tewari : మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు మ‌నీష్ తివారీ మ‌ద్ద‌తు

అధ్య‌క్ష ఎన్నిక‌ల వేళ శ‌శి థ‌రూర్ కు షాక్

Manish Tewari : కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి నువ్వా నేనా రీతిలో పోటీ కొన‌సాగుతున్న వేళ ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబ‌ర్ 17న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 19న రిజ‌ల్ట్ ప్ర‌క‌టిస్తారు ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మ‌ధుసూద‌న్ మిస్త్రీ. బ‌రిలో ఉన్న మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, శ‌శి థ‌రూర్ మ‌ధ్య బ‌ల‌మైన పోటీ నెల‌కొంది.

ఈ త‌రుణంలో ఇద్ద‌రూ ఒక‌రిని మించి మ‌రొక‌రు ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకుంటూ మ‌రింత ర‌క్తి క‌ట్టిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా సోనియా గాంధీ కుటుంబం స‌పోర్ట్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు(Mallikarjun Kharge) ఉండ‌గా జి23 అస‌మ్మ‌తి టీంలో కీల‌కమైన నేతగా ఉన్నారు శ‌శి థ‌రూర్.

ఈ బృందంలో మ‌నీష్ తివారీ(Manish Tewari)  కూడా ప్ర‌ధాన‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. పార్టీ ప‌నితీరులో మార్పులు చేయాల్సిందిగా కోరుతూ తాత్కాలిక అధ్య‌క్షురాలైన సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు 2020లో. ఆనాడు ఈ లేఖ క‌ల‌క‌లం రేపింది. ఇదిలా ఉండ‌గా నిన్న‌టి దాకా శ‌శి థ‌రూర్ కు మ‌ద్ద‌తుగా నిలిచారు.

కానీ ఉన్న‌ట్టుండి ప్లేటు ఫిరాయించారు తివారీ. తాను ప్ర‌స్తుతం అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉన్న మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు మ‌ద్ద‌తు తెలియ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న జీవితంలో 50 ఏళ్ల పాటు పాత పార్టీకి సేవ చేసేందుకు అంకితం చేసిన ఖ‌ర్గే రూపంలో కాంగ్రెస్ కు సుర‌క్షిత‌మైన చేతులు అవ‌స‌ర‌మ‌న్నారు.

కింది స్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు ఎదిగారు ఖ‌ర్గే. కాంగ్రెస్ కు స్థిర‌త్వం. ఇది ఖ‌ర్గే అందంచ గ‌ల‌ద‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు మ‌నీష్ తివారీ.

Also Read : ఎన్నిక నిర్వ‌హ‌ణ‌పై కామెంట్స్ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!