Mallikarjun Kharge Modi : మౌనం వీడ‌ని మోదీ బాబా – ఖ‌ర్గే

అభ్యంత‌రం తెలిపిన స్పీక‌ర్

Mallikarjun Kharge Modi : పార్ల‌మెంట్ లో మ‌రోసారి మాట‌ల తీవ్రత పెరిగింది. అదానీ హిండెన్ బ‌ర్గ్ వ్య‌వ‌హారం దుమ్ము రేపుతోంది. ఈ వివాదంపై ఇప్ప‌టికే రాహుల్ గాంధీ, మ‌హూవా మోయిత్రా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఇదిలా ఉండ‌గా ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంత జ‌రుగుతున్నా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్ర‌శ్నించారు.

ఆయ‌న‌కు ఓ పేరు కూడా పెట్టారు. అదే మౌని బాబా. ఈ మౌన వ్ర‌తం దేని కోసం అంటూ నిల‌దీశారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. రాజ్య‌స‌భ‌లో ఖ‌ర్గే చేసిన వ్యాఖ్య‌లపై బీజేపీ స‌భ్యులు తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. చైర్మ‌న్ గా ఉన్న ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. తాను అన్న‌దాంట్లో త‌ప్పేమీ లేద‌ని పేర్కొన్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge).

ఉన్న మాటే చెప్పాన‌ని పేర్కొన్నారు. నిన్న‌టి దాకా గౌత‌మ్ దానీని వెన‌కేసుకు వ‌చ్చిన మోదీ ఇవాళ ఎందుకు మౌనం వ‌హించారంటూ నిల‌దీశారు. దేశంలో విద్వేషాలు రెచ్చ గొడుతున్న వారి గురించి ప‌ల్లెత్తు మాట కూడా అన‌డం లేద‌న్నారు ఖ‌ర్గే. మౌనీ బాబా అన‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్.

మీరు చాలా సీనియ‌ర్ స‌భ్యుడు. ఇది మీకు స‌రిపోద‌న్నారు చైర్మ‌న్. వీటిని రాజ‌కీయం చేయొద్ద‌ని పేర్కొన్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ స‌భ్యుల‌కు మ‌ధ్య ర‌గ‌డ చోటు చేసుకుంది. ప్ర‌ధాని మోదీకి అత్యంత సన్నిహితుల్లో ఒక‌రి ఆస్తి భారీ గా పెరిగింది ఆదాయం. దాని గురించి అడ‌గాల‌ని అనుకుంటున్నాన‌ని ఎందుకు మౌనం వ‌హించార‌ని మండిప‌డ్డారు ఖ‌ర్గే.

Also Read : తేజ‌స్ జెట్ ఆత్మ నిర్భ‌ర్ కు ద‌ర్ప‌ణం

Leave A Reply

Your Email Id will not be published!