Mallikarjun Kharge : నేను పీఎం రేసులో లేను – ఖర్గే
ప్రతిపాదించిన దీదీ..కేజ్రీవాల్
Mallikarjun Kharge : న్యూఢిల్లీ – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సంచలన కామెంట్స్ చేశారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రతిపక్షాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా త్వరలో దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు.
Mallikarjun Kharge Comment
సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ , టీఎంసీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ , సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ , సీపీఎం నేతలతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను(Mallikarjun Kharge) ముందుకు తెచ్చారు. దీనిపై స్పందించారు ఖర్గే.
ముందు అందరం కలిసికట్టుగా ఎన్నికల్లోకి వెళ్లాలని ఆ తర్వాత ఎవరు పీఎం అనే దానిపై తర్వాత చర్చిద్దామని స్పష్టం చేశారు. అయితే తాను ప్రధాన మంత్రి పదవి రేసులో లేనని కుండ బద్దలు కొట్టారు. దీంతో మమతా బెనర్జీ, కేజ్రీవాల్ కొంత అసంతృప్తికి లోనయ్యారు.
Also Read : Bhushan Kumar : వంగాకు భూషణ్ కుమార్ కితాబు