Mallikarjun Kharge : మోదీ క‌ళ్లు మూసుకున్న ప్ర‌ధాని

నిప్పులు చెరిగిన ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే

Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఏకి పారేశారు. క‌ర్ణాట‌క‌లో కొలువు తీరిన బొమ్మై ప్ర‌భుత్వంఅవినీతిలో ఆరి తేరింద‌ని ఆరోపించారు. కానీ ప్ర‌ధాన మంత్రికి ఇదేమీ క‌నిపించ‌డం లేద‌న్నారు. ఒక ర‌కంగా ఆయ‌న క‌ళ్లున్న క‌బోది అని ఎద్దేవా చేశారు. బుధ‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే నిప్పులు చెరిగారు.

ప్ర‌ధాన మంత్రి తాను లంచాలు తీసుకోన‌ని, ఇత‌రుల‌ను తీసుకోనివ్వ‌నంటూ ప‌దే ప‌దే చెబుతూ వ‌స్తున్నార‌ని కానీ ఆచ‌ర‌ణ‌లో వాస్త‌వంలో అలా లేద‌న్నారు. అవినీతిని చ‌ట్ట‌బ‌ద్దం చేసిన ఘ‌న‌మైన చ‌రిత్ర క‌ర్ణాట‌క బీజేపీ స‌ర్కార్ కే ద‌క్కుతుంద‌న్నారు. నీతి సూత్రాలు వ‌ల్లె వేస్తూ ప్ర‌జ‌ల‌ను మాయ మాట‌ల‌తో మ‌భ్య పెడుతున్నారంటూ మోదీపై భ‌గ్గుమ‌న్నారు ఖ‌ర్గే(Mallikarjun Kharge).

ఇప్ప‌టికే ఈ దేశంలో సామాన్యులు బ‌తికే ప‌రిస్థితి లేకుండా పోయిందన్నారు. మోదీకి పీఎం ప‌ద‌వి కంటే త‌నంత‌కు తానుగా ప్ర‌మోట్ చేసుకోవ‌డంలో ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఉన్న వ‌న‌రుల‌ను గంప గుత్త‌గా బ‌డా బాబుల‌కు క‌ట్ట‌బెట్ట‌డంలో కీల‌క పాత్ర పోషించార‌ని పీఎంగా దేశానికి ఆయ‌న చేసింది ఏమీ లేద‌న్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge).

Also Read : గే క‌మ్యూనిటీ స‌మ‌స్య‌ల‌కు కేంద్రం భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!