Mallikarjun Kharge : ఫామ్ హౌస్ సీఎంను సాగనంపండి
పిలుపునిచ్చిన మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణలో ఏకపక్ష, రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన విజయ భేరి సభలో ఖర్గే పాల్గొని ప్రసంగించారు.
Mallikarjun Kharge Slams KCR
ఇకనైనా ప్రజలు మేల్కోవాలని లేక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తప్పక అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆరు నూరైనా తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge).
సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టిందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. 5 హామీలను కర్ణాటకలో విజయవంతంగా అమలు చేస్తున్నామని , ఇక సోనియా గాంధీ విడుదల చేసిన , హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పక ఇస్తామని స్పష్టం చేశారు మల్లికార్జున్ ఖర్గే.
తాము విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల జాబ్స్ ను భర్తీ చేస్తామన్నారు. ఇకనైనా ప్రజలు ఆలోచించాలని ఫామ్ హౌస్ సీఎం కావాలా లేక ప్రజల కోసం పని చేసే సీఎం కావాలో తేల్చు కోవాలన్నారు ఏఐసీసీ చీఫ్.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.04 కోట్లు