Mamata Banerjee Amartya Sen : అమర్త్య సేన్ కు దీదీ భరోసా
నోబెల్ బహుమతి గ్రహీతకు జెడ్ ప్లస్
Mamata Banerjee Amartya Sen : ప్రముఖ ప్రపంచ ఆర్థిక వేత్త, 89 ఏళ్ల నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కు భూమి పత్రాలను అందజేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. విశ్వ భారత విశ్వ విద్యాలయంపై తమ ప్రభుత్వం చట్ట పరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పుడు మీ వద్ద సరైన ఆధారం ఉందన్నారు మమతా బెనర్జీ(Mamata Banerjee).
అంతే కాకుండా అమర్త్య సేన్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించారు సీఎం. ఇదిలా ఉండగా శాంతి నికేతన్ లో ఉన్న నోబెల్ గ్రహీతను మమతా బెనర్జీ సందర్శించారు. ఆయనను పరామర్శించారు. విశ్వ భారతి విశ్వ విద్యాలయం నుండి అమర్త్య సేన్ కు అనేకసార్లు నోటీసులు అందాయి.
- భూమి యాజమాన్యంకు సంబంధించి నిరూపించేందుకు గాను ఇప్పటి వరకు పత్రాలు లేక పోవడంతో కొంత ఇబ్బందికి గురయ్యారు. దీనిని గమనించిన సీఎం హక్కు పత్రాలను స్వయంగా అందజేశారు. కాగా యూనివర్శిటీ నోటీసులు అందజేయడంపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మమతా బెనర్జీ.
అయితే విశ్వ భారతి విశ్వ విద్యాలయం తన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ జనవరి 24న ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్య సేన్ కు నోటీసు(Amartya Sen) పంపింది. గతంలో కూడా ఇలాంటి నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేసింది.
దీంతో సీఎం రంగంలోకి దిగారు. అమర్త్యసేన్ కు జరిగిన అవమానం తట్టుకోలేక తాను భూ రికార్డులు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు మమతా బెనర్జీ(Mamata Banerjee). వారు చెబుతున్నది పూర్తిగా తప్పు అని స్పష్టం చేశారు సీఎం.
Also Read : వయస్సు భారం ఎన్నికలకు దూరం