Mamata Banerjee : హింస ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదు
కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగిన దీదీ
Mamata Banerjee : రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) . ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
హింస ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదన్నారు. శాంతితోనే సమాజం మనుగడ సాధిస్తుందన్నారు. ఈ ఘటనను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
బుధవారం సీఎం ట్విట్టర్ వేదికగా సీరియస్ అయ్యారు. ప్రవక్తపై కామెంట్స్ చేసి అల్లర్లకు కారణమైన బీజేపీకి చెందిన నూపుర్ శర్మ ఏడుందని ప్రశ్నించారు.
ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. ఇదే సమయంలో ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహమ్మద్ జుబైర్ ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
ఇదే సమయంలో రాజస్తాన్ లో ప్రజలు సంయమనం పాటించాలని మమతా బెనర్జీ కోరారు. సోషల్ మీడియాలో బీజేపీ ఫేక్ ప్రచారం చేయడంలో టాప్ లో ఉందన్నారు.
తాను నిజాలు మాట్లాడే వారి పక్షాన ఉంటానని స్పష్టం చేశారు. మొత్తం అబద్దాలను వ్యాప్తి చేస్తూ జనాన్ని ఇబ్బందులకు గురి చేయడం దారుణమని పేర్కొన్నారు సీఎం.
బీజేపీ సోషల్ నెట్ వర్క్ మొత్తం ఫేక్ మయం అని ఆరోపించారు. మోసం చేయడం, చేయని పనుల్ని చేసినట్లు ప్రచారాన్ని చేపట్టడం బీజేపీ టాప్ లో ఉందని నిప్పులు చెరిగారు.
వాళ్ల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని, సోషల్ మీడియాలో , యూట్యూబ్ లో అబద్దాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటి దాకా కేసులు నమోదు చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ ఫైర్ అయ్యారు.
Also Read : రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం – సీఎం
Violence and extremism are UNACCEPTABLE, no matter what!
I STRONGLY CONDEMN what happened in Udaipur.
As law takes its own course of action, I urge everyone to maintain peace.
— Mamata Banerjee (@MamataOfficial) June 29, 2022