Mamata Banerjee : కేంద్ర హొం శాఖ మంత్రి, ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ చంద్ర షాపై నిప్పులు చెరిగారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిపై ఫోకస్ పెట్టాలని హితవు పలికారు.
తమ రాష్ట్రంలో వేలు పట్టాల్సిన పని లేదని హెచ్చరించారు. వేరే ఎక్కడైనా రాజకీయాలు చేస్తే చెల్లుబాటు కావచ్చని కానీ బెంగాల్ గడ్డ మీద కాషాయం ఎత్తులు, జిత్తులు, మ్యాజిక్కులు పని చేయవన్నారు మమతా బెనర్జీ(Mamata Banerjee).
బెంగాల్ గురించి ఎలాంటి బెంగ అవసరం లేదన్నారు. ఒక రకంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కుల, మతాలు, ప్రాంతాల పేరుతో మనుషుల మధ్య విభేదాలు సృష్టించడమే బీజేపీ ప్రధాన ఎజెండాగా పెట్టుకుందన్నారు.
ఓ వైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయని కానీ వాటిని పరిష్కరించకుండా రాజకీయాలు చేయడం మంచి పద్దతి కాదని సూచించారు దీదీ.
కర్ణాటకలో హిజాబ్ వివాదం, మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్లు, మధ్య ప్రదేశ్ లో అల్లర్లు, గుజరాత్ లో దాడులు, ఢిల్లీలో జహంగీర్ పురి ఘటన వీటన్నింటి వెనుక ఎవరు ఉన్నారో దేశ ప్రజలకు తెలుసన్నారు.
ఈద్ పర్వదినం రోజున కూడా మీరు హింసను ప్రేరేపించ లేదా అంటూ అమిత్ షాపై నిప్పులు చెరిగారు మమతా బెనర్జీ(Mamata Banerjee). రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగానే ఉందన్నారు.
మీరు వస్తేనే మళ్లీ అల్లర్లు వస్తాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజలు బీజేపీని ఛీ కొట్టారని అయినా అమిత్ షా ఆలోచించడం లేదన్నారు.
Also Read : రాజకీయం చేయడంలో బీజేపీ టాప్