Mamata Banerjee : కావాల‌నే బీజేపీ రెచ్చ‌గొట్టింది – సీఎం దీదీ

కోల్ క‌త్తాలో చోటు చేసుకున్న హింస‌పై

Mamata Banerjee : టీఎంసీ చీఫ్, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee) భార‌తీయ జ‌న‌తా పార్టీ తీరుపై మండిప‌డింది. కేంద్రం స‌పోర్ట్ తో రాష్ట్రంలో అల్ల‌ర్లు సృష్టించేందుకు , శాంతి భ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌లిగించేలా చేసేందుకు ముంద‌స్తు ప్లాన్ తోనే ఇలా చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం.

వాళ్లు ఎన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేసినా త‌న ముందు వారి ఆట‌లు సాగ‌వ‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో అవినీతి, అక్ర‌మాల‌కు టీఎంసీ అడ్డాగా మారిందంటూ బీజేపీ ఛ‌లో మార్చ్ పిలుపునిచ్చింది.

పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. ప‌లువురు పోలీసులు గాయ‌ప‌డ్డారు. రెచ్చి పోయిన బీజేపీ శ్రేణులు పోలీసు వాహ‌నాన్ని త‌గుల బెట్టారు. బీజేపీకి చెందిన ప్ర‌ముఖ నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై సెప్టెంబ‌ర్ 19 లోగా నివేదిక ఇవ్వాల‌ని కోల్ క‌తా హైకోర్టు ఆదేశించింది ప్ర‌భుత్వాన్ని. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం సీఎం మ‌మ‌తా బెనర్జీ దీనిపై స్పందించారు. కావాల‌ని రెచ్చ‌గొట్టేందుకు య‌త్నించారంటూ మండిప‌డ్డారు.

ఈ హింస‌కు కార‌ణం ప్రభుత్వం, పోలీసులు కాదు కాషాయ శ్రేణులంటూ మండిప‌డ్డారు. బీజేపీ నిర‌స‌న‌కారులు చాలా మంది పోలీసుల‌పై చేయి చేసుకున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

చ‌ట్టాన్ని త‌మ చేతుల్లో తీసుకున్న వారిపై కేసులు న‌మోదు చేయాల‌న్నారు. ప్ర‌శాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అల్ల‌క‌ల్లోలం చేయ‌డ‌మే బీజేపీ ప‌నిగా పెట్టుకుంద‌న్నారు మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee).

శాంతియుతంగా జ‌రిపే నిర‌స‌న‌ల‌కు తాము వ్య‌తిరేకం కాద‌న్నారు. కాగా బీజేపీ హింస‌, దౌర్జ‌న్యాల‌ను ఆస‌రాగా చేసుకుంద‌న్నారు.
హౌరాలో వారు తుపాకులు, ఆయుధాల‌తో ఉన్నార‌ని ఆరోపించారు సీఎం.

Also Read : మ‌రాఠాకు గుజ‌రాత్ కంటే బెట‌ర్ ప్రాజెక్టు

Leave A Reply

Your Email Id will not be published!