Mamata Banerjee : కేంద్ర సర్కార్ పై దీదీ కన్నెర్ర
నిధుల మంజూరుపై నిర్లక్ష్యంపై ఫైర్
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేయక పోవడాన్ని తప్పు పట్టారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ, బీజేపీయేతర రాష్ట్రాలకు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు.
మోదీ త్రయం (మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ) చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు తమపై పని చేయమని ఆమె హెచ్చరించారు. కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న వివక్షను నిరసిస్తూ వచ్చే నెల జూన్ 5, 6 తేదీలలో ఆందోళనలు, నిరసనలు చేపడతామని చెప్పారు.
సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) రాష్ట్రంలోని పశ్చిమ బర్దమాన్ జిల్లా దుర్గాపూర్ లో మీడియాతో మాట్లాడారు. కేంద్రం చిల్లర రాజకీయాలు చేస్తోందంటూ సీరియస్ అయ్యారు. చాలా వాటికి నిధులు మంజూరు చేయకుండా నాటకాలు ఆడుతోందంటూ నిప్పులు చెరిగారు.
అంతే కాకుండా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన నిరుపేదలకు సొమ్ములు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. కూలీల పొట్ట కొట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు మమతా బెనర్జీ.
ఈ ఒక్క స్కం కింద ఏకంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 6,000 కోట్లు రావాల్సి ఉందని, దీనిని ఇవ్వకుండా తొక్కి పెట్టిందంటూ ఆరోపించారు సీఎం.
తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోర లేదన్నారు. కానీ రాష్ట్రానికి న్యాయ బద్దంగా రావాల్సిన నిధులు మంజూరు చేయాలని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee).
Also Read : 16 మంది బీజేపీ అభ్యర్థులు డిక్లేర్