Mamata Banerjee : బీజేపీకి అంత సీన్ లేదు – దీదీ
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉండదు
Mamata Banerjee : టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మరోసారి భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు. 2024లో దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పవర్ లోకి రాదన్నారు. ఇప్పటికే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ దేశాన్ని అమ్మకానికి పెట్టిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.
2019 సంవత్సరానికి ముందు బీహార్ , జార్ఖండ్ తో పాటు ఇతర రాష్ట్రాలలో బీజేపీకి పట్టు ఉండేదని ఇప్పుడు దానికి అంత సీన్ లేదన్నారు. ప్రజలు ఈ భారమైన పాలనను ఎంత కాలం భరించే స్థితిలో లేరన్నారు. దేశంలో రోజు రోజుకు రాజకీయ పరిస్థితులు, సమీకరణలు వేగంగా మారి పోతున్నాయని చెప్పారు.
ఎన్నికలప్పుడే బీజేపీకి సీఏఏ, ఇతర చట్టాలు గుర్తుకు వస్తాయని కానీ అవి అయిపోయాక వాటి గురించి అస్సలు ఊసెత్తదని ఆరోపించారు మమతా బెనర్జీ. రాష్ట్రంలోని నదియా జిల్లాలో నిర్వహించిన టీఎంసీ భారీ ర్యాలీని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఆరు నూరైనా తాము సీఏఏ, ఎన్ఆర్సీ వంటి వాటిని అమలు చేసే ప్రసక్తి లేదన్నారు.
ఆరు నూరైనా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను తమకు అనుకూలంగా ఉండేలా మార్చుకుంటోందని ధ్వజమెత్తారు.
ఇప్పటి వరకు దేశం కోసం చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే ప్రధానమంత్రి మోదీ చెప్పాలని , శ్వేత పత్రం విడుదల చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. నోట్లు రద్దు చేసి ఆరు ఏళ్లు పూర్తయ్యాయని ఎంత మంది ఆర్థిక నేరగాళ్లను తీసుకు వచ్చారో చెప్పాలన్నారు.
Also Read : ఢిల్లీకి పార్ట్ టైమ్ సీఎం అక్కర్లేదు – మీనాక్షి