Mamata Banerjee Murmu : గిరిజన సాంప్రదాయంలో మమతాబెనర్జీ రాష్ట్రపతికి ఘన స్వాగతం

Mamata Banerjee Murmu : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈరోజు రాష్ట్రపతి దౌపది ముర్ముకు గిరిజన సాంస్కృతిక కార్యక్రమంతో ఘన స్వాగతం(Mamata Banerjee Murmu) పలికారు. ఆమె గిరిజన డ్రమ్ వాయిస్తూ, గిరిజన నృత్యంలో ప్రదర్శకులతో కలిసి, రాష్ట్రపతి నిరంతరం చిరునవ్వుతో కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఇది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో హాట్ టాపిక్ గా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ముర్ము కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గవర్నర్ సివి ఆనంద బోస్ కూడా ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగాల్‌లో ఉంటారు. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఆమె రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి.

కాగా .. రాష్ట్రపతికి అధికారిక పౌర రిసెప్షన్ కార్యక్రమం, ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బిజెపికి చెందిన సువేందు అధికారి పేర్కొనడంతో, అంతకుముందు రోజు వివాదాస్పదం అవడం గమనార్హం.

అయితే తృణమూల్ కాంగ్రెస్ ఆ ఆరోపణను “నిరాధారం” అని కొట్టిపారేసింది మరియు బిజెపి నాయకులు ఆహ్వానించబడినప్పటికీ రాష్ట్రపతి కార్యక్రమాన్ని “బహిష్కరించారు” అని ఆరోపించింది.

 

Also Read : హత్రాస్ కేసుపై ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరణ

Leave A Reply

Your Email Id will not be published!