Honor Suicide: కుమార్తె కులాంతర ప్రేమ వివాహం ! మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య !
కుమార్తె కులాంతర ప్రేమ వివాహం ! మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య !
Honor Suicide : కుమార్తె కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ(Nalgonda) జిల్లా చిట్యాలలో జరిగింది. డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న చిట్యాల వాసి రెముడాల గట్టయ్య (48) కుమార్తె… అదే పట్టణానికి చెందిన ఓ దళిత యువకుడిని ప్రేమించింది. అయితే పెళ్ళికి కుటుంబసభ్యులు నిరాకరించడంతో.. వారికి తెలియకుండా గతనెల 8న పెళ్లి చేసుకుంది. దీనిపై గట్టయ్య తన కుమార్తె అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తన కూతురితో ఒక్కసారి మాట్లాడించాలని గట్టయ్య చిట్యాల పోలీసులను వేడుకున్నాడు. అందుకు పోలీసులు నిస్సహాయత వ్యక్తంచేయటంతో నెల రోజుల నుంచి గట్టయ్య పలువురు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి మొరపెట్టుకున్నాడు.
Honor Suicide Viral
అయితే, ఇంటినుంచి వెళ్లిపోయిన 3 రోజుల తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన గట్టయ్య కూతురు.. తాను ఊదరి యాదగిరి అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నానని, తన కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరింది. దీనితో ఇదే విషయాన్నిస్థానిక ఎస్‌ఐ… గట్టయ్యకు చెప్పారు. మీ కుమార్తె ప్రేమవివాహం చేసుకుని జిల్లా ఎస్పీ దగ్గర సరెండర్ అయిందని, తల్లిదండ్రులను కలవనని చెప్పిందని ఎస్‌ఐ చెప్పారు. దీనితో మనస్తాపానికి గురైన గట్టయ్య ఈ నెల 10న ఆత్మహత్యాయత్నం(Honor Suicide) చేశాడు.
దీనితో ఆయన్న కుటుంబసభ్యులు చికిత్స కోసం నార్కట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి… తర్వాత పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం గట్టయ్య మృతి చెందాడు. గట్టయ్య మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతడి బంధువులు చిట్యాల పోలీసుస్టేషన్ వద్ద ధర్నా చేశారు. అయితే, గట్టయ్య ఫిర్యాదు ఇచ్చిన వెంటనే విచారణ చేపట్టేలోపే… అతని కుమార్తె తన తల్లిదండ్రులు, బంధువులతో ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరడంతోపాటు తల్లిదండ్రులను కలవనని స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు చిట్యాల ఎస్‌ఐ తెలిపారు. గట్టయ్య మృతి విషయం తెలియగానే శనివారం ఉదయం చిట్యాల పోలీస్‌స్టేషన్ వద్దకు మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున చేరుకొని నిరసనకు దిగారు. దీనితో నార్కట్‌పల్లి సీఐ కె నాగరాజు అక్కడికి చేరుకుని గట్టయ్య కూతురుతో ఫోన్‌లో మాట్లాడారు. తండ్రి మృతి విషయం తనకు తెలిసిందని, అయినా ముంబైలో ఉన్న తాను తిరిగి రానని కరాఖండిగా చెప్పింది. దీనితో మృతుడి కుటుంబ సభ్యులు నిరసనను విరమించారు.
Also Read : PM Narendra Modi: జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ ఒక ఘోర అధ్యాయం – ప్రధాని మోదీ