Manickam Tagore : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఉధృతమైంది. ఆ పార్టీలో రెండు వర్గాలుగా చీలి పోయారు. ఓ వర్గం గాంధీ కుటుంబాన్ని వెనకేసుకు వస్తుండగా ఇంకో వర్గం గాంధీ ఫ్యామిలీని వ్యతిరేకిస్తోంది.
తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సంచలన కామెంట్స్ చేశారు. గాంధీ కుటుంబానికి చెందిన వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అంతే కాదు స్వచ్చంధంగా తప్పుకుంటే మంచిదని సూచించారు. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఈ తరుణంలో రాహుల్ గాంధీకి ముఖ్య అనుచరుడిగా, ఆ ఫ్యామిలీలో ఒకడిగా ఉన్న సీనియర్ నాయకుడు మాణిక్యం ఠాగూర్(Manickam Tagore) స్పందించారు.
ట్విట్టర్ వేదికగా కపిల్ సిబల్ పై సీరియస్ అయ్యారు. ఏవైనా అభిప్రాయాలు ఉంటే పార్టీ అంతర్గత సమావేశాలలో మాట్లాడాలి కాని ఇలా బహిరంగంగా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.
ఒక రకంగా చూస్తే కపిల్ సిబల్ ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ భాష మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేసేందుకే వీళ్లంతా నాయకత్వం నుంచి తప్పించాలని కోరుతున్నారంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ మైండ్ గేమ్ లో కపిల్ సిబల్ పడవద్దంటూ హితవు పలికారు మాణిక్యం ఠాగూర్.
ఇదిలా ఉండగా ఢిల్లీ వేదికగా జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని పార్టీని కాపాడుకుంటే బెటర్ అని సూచించారు.
Also Read : హిజాబ్ తీర్పుపై ఓవైసీ కీలక కామెంట్స్