Manipur Victims : రాహుల్ కోసం బాధితుల నిరీక్ష‌ణ

మ‌ణిపూర్ లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం

Manipur Victims : వాళ్లు ఎవ‌రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాదు. కానీ మ‌ణిపూర్ కు చెందిన సాధార‌ణ ప్ర‌జ‌లు. వారంతా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కోసం వేచి ఉన్నారు. వారి ఆశ‌ల్ని నెర‌వేర్చే నాయ‌కుడు రాహుల్ అని న‌మ్ముతున్నారు. గ‌త కొంత కాలంగా మ‌ణిపూర్ వాసులు తీవ్ర గాయాల‌కు గుర‌య్యారు. ఇప్ప‌టికీ ఆ రాష్ట్రంలో అసాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం కొలువు తీరి ఉంది.

జాతుల మ‌ధ్య చోటు చేసుకున్న ఆధిప‌త్య పోరు చివ‌ర‌కు గాలి వాన‌గా మారింది. వేలాది మందిని నిరాశ్ర‌యుల‌ను చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఘ‌ర్ష‌ణ‌ల్లో హింస చోటు చేసుకుంది. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 50,000 వేల మందికి పైగా నిరాశ్ర‌యుల‌య్యారు. వీరంతా మ‌ణిపూర్ రాష్ట్రాన్ని వ‌దిలేసి వెళ్లి పోయారు. 10 వేల మంది సైనికులు మోహ‌రించినా ఫ‌లితం లేకుండా పోయింది.

దీంతో మ‌ణిపూర్ లో చోటు చేసుకున్న హింస‌ను ఎందుకు కంట్రోల్ చేయ‌లేక పోతున్నారంటూ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప‌దే ప‌దే కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తూ వ‌చ్చారు. తాజాగా ఆయ‌న మ‌ణిపూర్ కు చేరుకున్నారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన రాహుల్ ను పోలీసులు అడ్డుకున్నారు. అక్క‌డ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాను టెర్ర‌రిస్టును కాద‌ని కేవ‌లం ప‌రామ‌ర్శించేందుకు వెళుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Rahul Gandhi : జ‌న గ‌ర్జ‌న స‌భ‌కు రాహుల్ గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!