Manish Sisodia : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పై సిసోడియా ఫైర్
చివరి నిమిషంలో ఆఫీసర్లను సస్పెండ్ చేశారు
Manish Sisodia : ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఆధిపత్య పోరు కొనసాగుతోంది ఢిల్లీ ఆప్ సర్కార్ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా మధ్య. ఈ సందర్భంగా ఎల్జీపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ఎక్సైజ్ పాలసీ కారణంగా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు.
కొత్త పాలసీని అమలు చేసే కంటే ముందు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సక్సేనా చివరి క్షణంలో యూ టర్న్ తీసుకున్నాడంటూ ధ్వజమెత్తారు.
ఈ విషయంపై దర్యాప్తు చేయాల్సిందిగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్ ఢిల్లీ లోని మథుర రోడ్ లో ఉన్న తన నివాసంలో మాట్లాడారు మనీష్ సిసోడియా(Manish Sisodia) . 2021-22 ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఫైల్ అమలుకు ముందు రెండుసార్్లు లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు వెళ్లిందన్నారు.
మొదటి సందర్భంలో అప్పటి ఎల్జీ గా ఉన్న అనిల్ బైజాల్ కొన్ని సూచనలు, మార్పులతో ఫైల్ ను వెనక్కి పంపారని తెలిపారు. ఈ సందర్భంగా అప్పటి ఎల్జీ చేసిన వాటిని అనుసరించి మార్పులు చేసిందని చెప్పారు.
సదరు ఫైల్ ను రెండో సారి నవంబర్ మొదటి వారంలో పంపించామని తెలిపారు. కొత్త విధానం నవంబర్ 17 నుండి అమలు లోకి రావాల్సిఉందన్నారు.
నవంబర్ 15న ఫైల్ తిరిగి వచ్చిందని కేవలం 48 గంటల్లో మార్పులు చేయాలని కోరడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు మనీష్ సిసోడియా.
Also Read : ఈడీ ముందుకు సంజయ్ రౌత్ భార్య