Manish Sisodia : ఆప్ నేతకు సమన్లపై మనీష్ సీరియస్
కేంద్రం కక్ష సాధింపు ధోరణికి పరాకాష్ట
Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో వికెట్ పడింది. కేంద్రం కావాలని వేధింపులకు గురి చేస్తోందంటూ ఆప్ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసింది.
డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) తో పాటు 14 మంది ఉన్నతాధికారులపై అభియోగాలు మోపింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 40 కోట్ల మద్యం పాలసీకి సంబంధించి ఈడీ సోదాలు జరిపింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తదితరులకు సంబంధించిన ఆఫీసులపై దాడులు జరిపింది.
ఇదే క్రమంలో ఢిల్లీ ఎక్సైజీ పాలసీలో నిందితుడు విజయ్ నాయర్ తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై దర్యాస్తు సంస్థ ఆప్ నాయకుడు దుర్గేష్ పాఠక్(Durgesh Pathak) కు సమన్లు పంపింది.
ఇక ఈడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో విజయ్ నాయర్ ను ప్రధాన నిందిడిగా చేర్చింది. ఇదిలా ఉండగా సోమవారం పాఠక్ కు చెందిన మొబైల్ ఫోన్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది.
కేంద్ర దర్యాప్తు సంస్థ సంచలన ప్రకటన చేసింది. అదేమిటంటే ఈనెల ప్రారంభంలో ఈడీ నిర్వహించిన దాడిలో విజయ్ నాయర్ ముంబై ఇంటిలో దుర్గేష్ పాఠక్ ఉన్నారని స్పష్టం చేసింది.
కాగా మద్య పాలసీ ఉల్లంఘనలపై సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న 15 మంది నిందితుల జాబితాలో నంబర్ వన్ గా ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా దుర్గేష్ పాఠక్ కు సమన్లు పంపడాన్ని తప్పు పట్టారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు తప్ప మరొకటి కాదన్నారు.
Also Read : బీజేపీలో చేరాలనుకునే వారిని అడ్డుకోం