Manish Sisodia : ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఇటీవలే దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. బీజేపీ నాలుగు రాష్ట్రాలలో మరోసారి సత్తా చాటింది.
ఇక ఆప్ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి పంజాబ్ లో అఖండ విజయాన్ని నమోదు చేసింది. మిగతా రాష్ట్రాలలో కూడా సత్తా చాటింది. గోవాలో రెండు సీట్లు గెలుచుకుంది.
ఇదిలా ఉండగా రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త విద్యా విధానాన్ని తీసుకు వచ్చింది.
ఇందులో భాగంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలు నేర్పించాలని, అందుకు సరైన ఆయుధం, సమాధానం భగవద్గీత ఒక్కటేనని ఆ ప్రభుత్వం భావించింది.
ఈ మేరకు 6 నుంచి 12 వ తరగతి వరకు భగవద్గీత ను పాఠ్యాంశాలలో చేర్చింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి దేశ వ్యాప్తంగా స్పందన లభిస్తోంది.
ఇది మంచి నిర్ణయం అంటూ కితాబు కూడా ఇస్తున్నారు. ఇదే సమయంలో ఆప్ డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రిగా ఉన్న సిసోడియో(Manish Sisodia )సంచలన కామెంట్స్ చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ నాయకులపై ఫైర్ అయ్యారు.
వారి నిత్యం నీతి వాక్యాలు, మాటలు మాట్లాడతారని పదే పదే భగవద్గీత గురించి గొప్పగా చెబుతారని కానీ చేతలు మాత్రం రావణాసురుడిని పోలి ఉంటాయని ఆరోపించారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : సువేందు నిర్వాకం ఎమ్మెల్యేలు ఆగ్రహం