Manish Sisodia : తాజాగా ఢిల్లీలో కొత్తగా పాఠశాలలో విద్యార్థితో పాటు టీచర్ కు పాజిటివ రావడం కలకలం రేపింది. దీనిపై ఢిల్లీ ఆప్ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు మరింత కట్టుదిట్టం చేస్తామని ప్రకటించింది.
ఇందులో భాగంగా కోవిడ్ -19 కు గాను కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia). ఢిల్లీ స్కూల్ లో చోటు చేసుకున్న కేసుకు సంబంధించి పూర్తి నివేదిక తెప్పించు కుంటామన్నారు.
ఆ రిపోర్ట్ వచ్చాక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే కోవిడ్ అన్నది ప్రస్తుత తరుణంలో జీవనంలో ఓ భాగమై పోయిందని పేర్కొన్నారు సిసోడియా. కాగా తాము కరోనా పై సమీక్షిస్తున్నామని వెల్లడించారు.
ఈ మేరకు మర్గదర్శకాలు జారీ చేయడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా టెస్టులు నిర్వహించడం, మందుల్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.
గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia). దేశ రాజధానిలో కోవిడ్ -19 కేసులు కొద్దిగా పెరిగాయని వెల్లడించారు.
కాగా ఆస్పత్రిలో చేరినందు వల్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నాడు. ఢిల్లీ వాసులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాఠశాలలకు మార్గదర్శకాలను జారీ చేస్తుందని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా పాఠశాలల నుంచి తనకు నివేదికలు వచ్చాయని వెల్లడించారు మనీష్ సిసోడియా.
దీనికి సంబంధించి విద్యా శాఖ రూల్స్ జారీ చేస్తుందన్నారు.
Also Read : ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం ప్రారంభం