Manish Sisodia : మోదీ సర్కార్ పై మనీశ్ సిసోడియా ఫైర్
రుణాలు ఎందుకు మాఫీ చేశారో చెప్పండి
Manish Sisodia : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు ఆప్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. మోదీ వల్ల దేశానికి ఒరిగింది ఏమీ లేదన్నారు.
అప్పులు తప్ప ఏమీ మిగల లేదని పేర్కొన్నారు. దేశం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయేందుకు కారణమయ్యాడని మండిపడ్డారు.
తన స్నేహితులకు సంబంధించి పన్నుల మినహాయింపులు ఎందుకు పొందారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారికి సంబంధించి వేల కోట్ల విలువైన రుణాలను ఏ పద్ధతిన మాఫీ చేశారో దేశానికి జవాబు ఇవ్వాలని కోరారు మనీశ్ సిసోడియా(Manish Sisodia).
కేంద్ర సర్కార్ ఒకటి కాదు రెండు కాదు రూ. 10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడం దారుణమన్నారు. బడా వ్యాపారవేత్తలు, కార్పొరేట్ లు, బిజినెస్ టైకూన్లు, ఆర్థిక నేరగాళ్లు, ప్రభుత్వ బ్యాంకులను లూటీ చేసిన వాళ్లను ఎందుకు రక్షించాలని అనుకుంటున్నారో చెప్పాలన్నారు మనీశ్ సిసోడియా.
కావాలని పనిగట్టుకుని ఆర్థిక వ్యవస్థను, దేశాన్ని సర్వ నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టారని , ఈ డబ్బులను ఎవరి కోసం ఖర్చు చేశారంటూ ప్రశ్నించారు డిప్యూటీ సీఎం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేవలం తన స్నేహితుల కోసం దేశాన్ని తాకట్టు పెట్టడం దారుణమన్నారు మనీశ్ సిసోడియా. ఇదిలా ఉండగా మోదీ కేంద్ర సర్కార్ తో ఢిల్లీలోని ఆప్ సర్కార్ నిత్యం పోరాడుతూ వస్తోంది.
ఢిల్లీపై ఎవరి పెత్తనం ఉండాలనే దానిపై ఇరువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Also Read : 5 వేల పెట్టుబడితో రూ. 11,000 వేల కోట్లు