Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ అగ్ర నాయకుడు, ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన ఇప్పటికే తీహార్ జైలులో ఉన్నారు. ఇవాళ కోర్టులో హాజరు పర్చగా సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీలో మనీష్ సిసోడియా కీలక పాత్ర పోషించారని ఆరోపించింది. కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. మొత్తం 14 ఫోన్లు వాడారని, కేవలం తమకు ఒక ఫోన్ మాత్రమే తమకు ఇచ్చారని తెలిపింది.
ఒకవేళ మనీష్ సిసోడియాకు(Manish Sisodia) బెయిల్ గనుక ఇచ్చినట్లయితే సాక్ష్యాలు తారు మారు చేస్తాడని, ఆయన బయటకు కనిపించినంత సాఫ్ట్ కాదంటూ ఆరోపించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. శనివారం మరోసారి తీహార్ జైలుకు వెళుండగా మీడియాతో మాట్లడారు సిసోడియా. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. ఒకవేళ పాల్పడి ఉంటే, అక్రమాలు చోటు చేసుకుంటే ఆనాటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎలా సంతకం చేస్తారంటూ ప్రశ్నించారు.
ఇదంతా కావాలని మోదీ టీం చేసిన కుట్ర అని ఆరోపించారు. ఏదో ఒక రోజు సత్యం గెలుస్తుందని, అంత వరకు అబద్దం రాజ్యం ఏలుతుందని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోలేరంటూ కుండ బద్దలు కొట్టారు మనీష్ సిసోడియా.
Also Read : మన్ కీ బాత్ కి బిల్ గేట్స్ ఫిదా