Manish Sisodia : అస్సాం సీఎం అవినీతిపై మౌనమేల..?

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన డిప్యూటీ సీఎం

Manish Sisodia : మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ , ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సార‌థ్యంలోని ఢిల్లీ ప్ర‌భుత్వాల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాట‌ల యుద్దం న‌డుస్తోంది.

ఇప్ప‌టికే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్ ను అరెస్ట్ చేసింది. ఈ మేర‌కు క‌స్ట‌డీలోకి తీసుకుంది. ఎలాంటి ఆధారాలు చూప‌లేక పోయిందంటూ మండిప‌డ్డారు సీఎం కేజ్రీవాల్.

కేవ‌లం ఇబ్బందులు పెట్టేందుకు మాత్ర‌మే కేంద్రం ఇలా ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను వినియోగించు కుంటోందంటూ ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న ఆస‌క్తక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

త‌దుప‌రి అరెస్ట్ త‌న స‌హ‌చ‌రుడు మ‌నీష్ సిసోడియా(Manish Sisodia)  ఉండ‌బోతున్నారంటూ అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ త‌రుణంలో బీజేపీని టార్గెట్ చేశారు డిప్యూటీ సీఎం సిసోడియా.

ఆయ‌న ఏకంగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ‌పై నిప్పులు చెరిగారు. ఆయ‌న‌పై ఎన్నో ఆరోప‌ణ‌లు వ‌చ్చినా బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం , కేంద్రం ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు.

మ‌రి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఏం చేస్తోందంటూ నిల‌దీశారు. అస్సాం సీఎం శ‌ర్మ త‌న కుటుంబానికి సంబంధించిన కంపెనీకి కోవిడ్ ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ (పిపిఇ) కిట్ ల కాంట్రాక్టును ఇచ్చార‌ని ఆరోపించారు.

గేర్ కు భారీగా చెల్లించారంటూ సిసోడియా ఢిల్లీలో శ‌నివారం ఆరోపించారు. శ‌ర్మ త‌న భార్య కంపెనీకి కాంట్రాక్టు ప‌రంగా రూ. 990 చెల్లించార‌ని, కానీ ఇదే పీపీఇ కిట్ ను ఇత‌రులు అదే రోజు మ‌రొక కంపెనీ నుండి రూ. 600కి కొనుగోలు చేశార‌ని ఆరోపించారు సిసోడియా.

ఈ ఆరోప‌ణ‌లు నిరూపించేందుకు త‌న వ‌ద్ద త‌గిన ఆధారాలు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

Also Read : కేంద్ర స‌ర్కార్ పై కేజ్రీవాల్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!